IPL Update

ఐపీఎల్ 2026 షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గుజరాత్లో ఎన్నికల నేపథ్యంలో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ మార్పు చేసింది.
The IPL 2026 schedule has seen minor changes, with the BCCI swapping venues for Chennai Super Kings and Gujarat Titans matches due to municipal elections in Gujarat.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఉత్కంఠగా కొనసాగుతున్న సమయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏప్రిల్ 26, మే 21 తేదీల్లో జరగాల్సిన సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌ల వేదికలను పరస్పరం మార్చింది.
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 26న మ్యాచ్ అహ్మదాబాద్‌లో, మే 21న చెన్నైలో జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు అవసరం కావడంతో బీసీసీఐ ఈ మార్పులు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 26న చెన్నైలో, మే 21న అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగుతుంది.
ప్రస్తుతం ఐపీఎల్ 2026 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మే 31న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠగా మారుతోంది.
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో మిశ్రమ ఫలితాలు నమోదు చేస్తోంది. తొలి నాలుగు మ్యాచుల్లో రెండు గెలిచి, రెండు ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటములతో సీజన్‌ను ప్రారంభించినప్పటికీ, తరువాతి మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది.
గాయం కారణంగా మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటివరకు ఆడకపోవడం సీఎస్కేకు ప్రతికూలంగా మారింది. సీజన్ రెండో భాగంలో అతను జట్టులోకి వచ్చే అవకాశముంది.
The Board of Control for Cricket in India (BCCI) has made slight changes to the IPL 2026 schedule amid the ongoing 19th season. Due to municipal elections in parts of Gujarat, the venues for two matches between Chennai Super Kings and Gujarat Titans have been interchanged.
As per the revised schedule, the April 26 match will now be held in Chennai instead of Ahmedabad, while the May 21 match will take place in Ahmedabad instead of Chennai. The change was made to ensure smooth conduct of elections and maintain security arrangements.
IPL 2026 continues to deliver thrilling matches, keeping fans engaged. With the final scheduled for May 31, the competition among teams is intensifying.
Gujarat Titans have had a mixed start this season, winning two and losing two of their first four matches, placing them sixth in the points table. Chennai Super Kings, on the other hand, began with three consecutive losses but secured a win later to open their account.
The absence of Mahendra Singh Dhoni due to injury has affected CSK’s performance, though he is expected to return in the latter half of the season.