English News Headline
Charlapalli Vijaya Reddy Case: Husband Alleges Threat to Life in Telangana

హైదరాబాద్ పరిసర ప్రాంతమైన చర్లపల్లిలో జరిగిన విజయారెడ్డి బలవన్మరణం కేసులో కొత్త మలుపు తిరిగింది. తనకు ప్రాణహాని ఉందంటూ విజయారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.
ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద విజయారెడ్డి ప్రాణాలు తీసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా, తాజాగా భర్త చేసిన ఆరోపణలు కేసును మరింత క్లిష్టంగా మార్చాయి.
సురేందర్‌రెడ్డి ఫిర్యాదు ప్రకారం, తన భార్య మరణానికి ఆమె కుటుంబ సభ్యులే కారణమని అనుమానం వ్యక్తం చేశాడు. ఆమె తల్లి పుష్పలత, అన్న చిరంజీవి, వదిన లక్ష్మి కలిసి ఆస్తి కోసం ఒత్తిడి తెచ్చారని ఆరోపించాడు. ఈ వేధింపుల వల్లే విజయారెడ్డి మానసికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నాడు.
అదేవిధంగా, తనను కూడా చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని సురేందర్‌రెడ్డి తెలిపాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ పోలీసులకు రక్షణ కోరినట్లు వెల్లడించాడు. పోలీసులు తనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ కేసులో ఆస్తి వివాదం కీలక కారణంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. భార్య, పిల్లలు చనిపోయిన కొద్ది రోజులకే ఆస్తి కోసం ఒత్తిడి తెచ్చారని భర్త ఆరోపించాడు.
పోలీసులు ప్రస్తుతం ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
Full English News Article
A new twist has emerged in the Charlapalli Vijaya Reddy suicide case in the outskirts of Hyderabad, Telangana, as her husband Surender Reddy approached the police alleging threat to his life.
The incident, in which software employee Vijaya Reddy died along with her two children near Charlapalli railway station, had earlier created widespread concern. The case is currently under investigation, and the latest allegations have added a new dimension.
According to Surender Reddy’s complaint, he suspects that his wife’s family members were responsible for her death. He alleged that her mother Pushpalatha, brother Chiranjeevi, and sister-in-law Lakshmi pressured her over property issues, leading to mental harassment and ultimately the extreme step.
He further claimed that he is now receiving threats to his life and has sought police protection. Police have reportedly assured him of security following his complaint.
The case appears to revolve around a property dispute, which the husband claims intensified even shortly after the deaths.
Police have registered the complaint and are investigating all angles in the case to ascertain the facts.