Telugu News Headlineటీజీ టెట్ నోటిఫికేషన్ త్వరలో

English News Headline
TG TET 2026 Notification Likely Soon in Telangana, Exams Planned in June Second Week


Full Telugu News Article

టెట్ పరీక్ష రాయేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణలో గుడ్‌న్యూస్ వచ్చింది. రాష్ట్రంలో టీజీ టెట్ నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది.

తెలంగాణలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జనవరిలో టెట్ పరీక్ష పూర్తికాగా, ఇప్పుడు రెండో విడత టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించేలా ప్రాథమిక షెడ్యూల్ సిద్ధమైంది.

ఒకవేళ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాకపోతే, ఈ నెలాఖరులోపు విడుదల చేసేలా అధికారులు సిద్ధంగా ఉన్నారు. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తుల ప్రక్రియ, పరీక్ష తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

ఇటీవల జనవరి 3 నుంచి 20 వరకు జరిగిన టెట్ పరీక్షలకు సుమారు 1.95 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో సగానికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. అలాగే ఇన్‌సర్వీస్ టీచర్లలో కూడా మంచి శాతం క్వాలిఫై అయ్యారు.

టెట్ పరీక్షలో అర్హత సాధిస్తే డీఎస్సీ పరీక్షకు జీవితకాలం వరకు అర్హత ఉంటుంది. బీఈడ్, డీఈడ్ అర్హత ఉన్న వారు ఎన్నిసార్లైనా టెట్ రాయవచ్చు. టెట్‌లో ఎక్కువ మార్కులు సాధిస్తే డీఎస్సీలో వెయిటేజ్ కూడా లభిస్తుంది.


Full English News Article

Good news has emerged for candidates preparing for the Teacher Eligibility Test in Telangana. The state education department has begun preparations to conduct the TG TET 2026 exam, with the notification likely to be released on the 13th of this month.

As per the government’s earlier promise to conduct the TET twice a year, the second phase is now being planned. The first TET exam was already held in January, and officials have now given the green signal for the next notification. The exams are tentatively scheduled for the second week of June.

In case the notification is not released on the 13th, authorities are prepared to issue it by the end of the month. Along with the notification, details regarding application process and exam schedule are expected to be announced.

In the previous TET conducted from January 3 to 20, around 1.95 lakh candidates appeared, with over half qualifying. A significant number of in-service teachers also cleared the exam.

Qualifying in the TET provides lifetime eligibility to appear for the DSC (teacher recruitment) exams. Candidates with B.Ed or D.Ed qualifications can attempt the TET multiple times. Higher scores in TET also provide additional weightage in DSC recruitment.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *