తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం…

Rain Alert in Telangana & Andhra: Heat and Thunderstorms Continue

Full Telugu News Article
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉండగా, మరోవైపు సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలో పలు జిల్లాల్లో ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో ఉక్కపోత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయంత్రం సమయాల్లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక ఏపీ రాష్ట్రంలో కూడా తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు వర్ష సూచనలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని, పలు జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు.

Full English News Article
Unusual weather conditions are prevailing across Andhra Pradesh and Telangana, with intense heat during the day and sudden rainfall in the evenings.

In Telangana, temperatures are crossing 40°C in several districts, making daytime conditions extremely uncomfortable. The heatwave combined with humidity is affecting normal life. However, by evening, the weather is changing abruptly, bringing gusty winds and moderate to heavy rainfall in parts of the state.

According to the Meteorological Department, a trough extending from Chhattisgarh to the Gulf of Mannar via Telangana and Rayalaseema has formed due to a cyclonic circulation. This system is expected to influence weather conditions for the next three days, leading to rainfall activity.

Districts including Mulugu, Bhupalpally, Khammam, Bhadradri Kothagudem, Nalgonda, Warangal, Mahabubabad, Siddipet, Rajanna Sircilla, and Suryapet are likely to receive rains. Authorities have warned of thunderstorms and lightning, advising people to stay cautious.

In Andhra Pradesh, rain alerts have been issued for East Godavari, Kakinada, and Konaseema districts. Some areas may also experience hailstorms. Meanwhile, temperatures continue to remain high, with several districts recording between 41°C and 42°C.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *