English News Headline
Delhi Capitals Lose by 1 Run; Axar Patel Consoles Miller in IPL Match

Full Telugu News Article
ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక్క పరుగుతో ఓటమి చవిచూసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ తరఫున డేవిడ్ మిల్లర్ గాయంతో రిటైర్ హర్ట్ అయినప్పటికీ, జట్టు పరిస్థితి క్లిష్టంగా మారడంతో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. చేతి గాయం ఉన్నా కూడా 20 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరికి తీసుకువచ్చాడు.
చివరి ఓవర్లో ఢిల్లీకి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి సింగిల్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మిల్లర్ పరుగెత్తలేదు. చివరి బంతికి షాట్ ఆడలేకపోయాడు. బై రూపంలో పరుగు తీసే ప్రయత్నంలో కుల్దీప్ యాదవ్ రన్ అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక పరుగుతో ఓడిపోయింది.
తన నిర్ణయం వల్లే జట్టు ఓడిపోయిందని భావించిన మిల్లర్ మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెట్టుకున్న అతడిని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓదార్చాడు. “ఏమీ కాలేదు” అన్నట్లుగా అతనితో మాట్లాడి ధైర్యం చెప్పాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్షర్ పటేల్ ప్రవర్తనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన కెప్టెన్ అంటే ఇలా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.
Full English News Article
In an IPL match held at Arun Jaitley Stadium in Delhi, Delhi Capitals suffered a narrow one-run defeat against Gujarat Titans in a last-over thriller. The match remained tense until the final ball.
David Miller, who had earlier retired hurt due to injury, returned to the crease as wickets kept falling. Despite struggling with a hand injury, he scored an unbeaten 41 off 20 balls and brought Delhi close to victory.
In the final over, Delhi needed two runs off two balls. Miller had an easy chance to take a single on the fifth delivery but chose not to run. On the last ball, he failed to connect properly. While attempting a bye to push the game into a Super Over, Kuldeep Yadav was run out, resulting in a one-run defeat for Delhi.
After the match, Miller appeared emotional, blaming himself for the loss. Delhi Capitals captain Axar Patel stepped in and consoled him, reassuring him that it was not his fault.
The video of the incident has gone viral on social media, with fans praising Axar Patel’s leadership and calling him a true captain for his supportive gesture