English News Headline
Telangana Rain Alert: Hailstorms, Strong Winds Expected Across Districts

Full Telugu News Article
తెలంగాణలో ఎండల తీవ్రత మధ్య వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇటీవలి రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో కూడా 38.5 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యాయి.
అయితే, ఈ ఎండల మధ్యనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గాలుల వేగం గంటకు 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని, వడగండ్ల వానలు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాల సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించారు.
హైదరాబాద్లో కూడా సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో పాటు ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రబీ పంటలు కోత దశలో ఉండగా, ఇప్పటికే పలు ప్రాంతాల్లో పంటలను ఆరబోశారు. వడగండ్ల వానలు, ఈదురుగాలులతో వరి, మొక్కజొన్న, మిరప పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం వద్ద రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Full English News Article
Amid rising heat conditions, the India Meteorological Department has issued a weather alert for Telangana, warning of hailstorms and thunderstorms in several districts over the next two days.
Temperatures have been soaring across Telangana in recent days. Madgulapally in Nalgonda district recorded a high of 41.6°C, while more than 14 districts crossed the 40°C mark. Hyderabad also witnessed high temperatures around 38.5°C.
Despite the intense heat, weather changes are expected. According to IMD forecasts, northern Telangana districts along with Sangareddy, Medak, Vikarabad, Mahabubnagar, and Nagarkurnool are likely to receive moderate to heavy rains accompanied by strong winds. A yellow alert has been issued for these areas.
Officials warned that wind speeds could reach up to 40 kmph, and there is a possibility of hailstorms. People have been advised to remain cautious and seek shelter during adverse weather conditions.
In Hyderabad, moderate to heavy rainfall is expected during evening hours. Authorities also cautioned about rising humidity along with heat.
The forecast has raised concerns among farmers. Rabi crops are currently at the harvesting stage, and in many places, produce has been laid out for drying. Sudden rains and hailstorms may damage crops such as paddy, maize, and chilli. Farmers have demanded compensation for crop losses already reported due to recent unseasonal rains