రథసేవలో రామయ్య, తరించిన అలియాబాద్ పట్టణవాసులు…

అలియాబాద్‌లో సీతారామచంద్రస్వామి జాతరను గురువారం భక్తిశ్రదలతో నిర్వహించగా, రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Sri Seetharamachandra Swamy Jatara was celebrated with enthusiasm in Aliyabad of Shamirpet mandal on Thursday, with a large number of devotees participating in the chariot procession.

అలియాబాద్ మున్సిపల్ పరిధిలో పురాతన, ప్రసిద్ద సీతారామచంద్రస్వామి జాతర ఘనంగా జరిగింది. గురువారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవాన్ని ఆలయం నుండి అలియాబాద్ ప్రధాన కూడలి వరకు ఊరేగించారు. అనంతరం తిరిగి ఆలయం వరకు రథాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తులు గడపగడపకు మంగళహారతులు పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.

జాతర సందర్భంగా పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్థానికంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు రథోత్సవంలో పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, జాతర సజవుగ సాగేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

The Sri Seetharamachandra Swamy Jatara was held grandly in Aliyabad under Shamirpet mandal. The chariot procession began early Thursday morning and was taken up to the Aliyabad bus stop before returning to the temple. Devotees offered prayers, performed rituals, and fulfilled their vows during the event.

A large number of people from nearby villages attended the festival, creating a vibrant spiritual atmosphere in the area. Municipal Chairperson Kantham Shirisha Krishna Reddy, along with councillors, participated in the procession and oversaw the arrangements. Organizers stated that adequate measures were taken to ensure the event concluded peacefully.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *