Trade License Renewal Alert

శామీర్‌పేట్ మండలంలోని అలియాబాద్ మున్సిపల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో, వ్యాపారులు సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
Traders in Aliabad municipality under Shamirpet mandal have been advised to renew their trade licenses on time as the deadline approaches.
శామీర్‌పేట్, మార్చి 24: మున్సిపల్ పట్టణ ప్రజలు ట్రేడ్ లైసెన్స్‌లను గడువు లోపు తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ అలియాబాద్ మున్సిపల్ పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ గడువు ఈ నెల 31తో ముగుస్తుందని చెప్పారు.
2026–27 సంవత్సరానికి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజును ఈ నెల 31లోపు ఆన్లైన్ లేదా మున్సిపల్ బిల్ కలెక్టర్ ద్వారా చెల్లించాలని సూచించారు. గడువు తేదీ లోపు ఫీజు చెల్లించని పక్షంలో 2019 మున్సిపల్ చట్టం ప్రకారం 25 శాతం పెనాల్టీ ఆటోమేటిక్‌గా విధించబడుతుందని తెలిపారు. కాబట్టి వ్యాపారులు గడువు లోపు ఫీజు చెల్లించి లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలని కోరారు.
Shamirpet, March 24: Municipal Commissioner Chandrasekhar urged traders to renew their trade licenses within the stipulated deadline. He stated that trade licenses for the financial year 2025–26 in Aliabad municipal limits will expire on March 31.
He advised traders to pay renewal fees for 2026–27 either online or through municipal bill collectors before the deadline. Failing to do so will attract a 25% penalty under the Municipal Act, 2019, which will be automatically applied online. Traders have been requested to complete the renewal process within the due date to avoid penalties.