శామీర్‌పేట్ మహిళలకు సేంద్రీయ వ్యవసాయ శిక్షణ …

Women Organic Farming Training

శామీర్‌పేట్ మండలంలోని అలియాబాద్ రైతు వేదికలో మహిళా సంఘ సభ్యులకు ఆధునిక, సేంద్రీయ వ్యవసాయంపై శిక్షణ నిర్వహించారు.
A training session on modern and organic farming was conducted for women self-help group members at Aliabad Rythu Vedika in Shamirpet mandal.

శామీర్‌పేట్, మార్చి 24: మహిళలు ఇంటి ఆవరణలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించుకోవాలని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుమోహన్, కేవికే శాస్త్రవేత్త డాక్టర్ దిలీప్ సూచించారు. మంగళవారం అలియాబాద్ రైతు వేదికలో శామీర్‌పేట్ మండలానికి చెందిన మహిళా సంఘ సభ్యులకు ఆత్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను స్వయంగా పండించుకోవాలని తెలిపారు. పురుగుమందులు వినియోగించకుండా సేంద్రీయ పద్ధతిలో పండిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వంటకు ముందు కూరగాయలను పది నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టాలని సూచించారు. పంటలు వేసే ముందు భూసార పరీక్షలు నిర్వహించడం అవసరమని మహిళా రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో కిచెన్ గార్డెన్ విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. వ్యవసాయ అధికారి రమేష్, కౌన్సిలర్ సరసం వనజ, మహిళా సంఘం అధ్యక్షురాలు అజయ లక్ష్మి, ఆత్మ బిటిఎం సంతోష్, ఏఈఓ సాగరిక, సిసి నాగశ్రీ, కోశాధికారి నర్మదతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

Shamirpet, March 24: Women should grow vegetables organically within their home premises, advised ATMA Project Director Madhumohan and KVK scientist Dr Dilip. An awareness and training program was organized on Tuesday at Aliabad Rythu Vedika for women self-help group members under the ATMA initiative.

They emphasized that women can meet household needs by cultivating vegetables at home using organic methods without pesticides, ensuring better health. They also advised soaking vegetables in salt water for ten minutes before cooking. Women farmers were encouraged to conduct soil testing before sowing crops.

Free kitchen garden vegetable seeds were distributed during the program. Agriculture Officer Ramesh, Councillor Sarasam Vanaja, SHG President Ajaya Lakshmi, ATMA BTM Santosh, AEO Sagarika, CC Nagashree, Treasurer Narmada, and several women participated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *