మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో రూ.12.88 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన…

CC Road Foundation Laid in Moodu Chinthalapalli Municipality

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, శామీర్ పేట : మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో రూ.12.88 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మున్సిపల్ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్ జామ్ రవి తెలిపారు.

మూడు చింతలపల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డు ఎస్సీ కాలనీలో సోమవారం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ శాఖ సహకారంతో రూ.12 లక్షల 88 వేల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ జామ్ రవి మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. ప్రజల సహకారంతో మూడు చింతలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పరచి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, కౌన్సిలర్ ర్యాకల నీరజ్ గౌడ్, పంచాయతీరాజ్ ఏఈఈ సన షాహిన్, మున్సిపల్ డీఈఈ స్ఫూర్తి, మేనేజర్ ఉష, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

A foundation stone was laid for the construction of a CC road worth ₹12.88 lakh in the SC Colony of Ward No.4 in Moodu Chinthalapalli Municipality of Shamirpet mandal. Municipal Chairman Jam Ravi said he will strive for the overall development of the municipality with public cooperation.

The foundation stone for a CC road was laid on Monday in the SC Colony of Ward No.4 in Moodu Chinthalapalli Municipality under Shamirpet mandal. The road will be constructed with an estimated cost of ₹12.88 lakh with the support of the Panchayat Raj Department.

Speaking on the occasion, Municipal Chairman Jam Ravi said he will work towards the development of the municipality with the support of all sections of society. He stated that Moodu Chinthalapalli Municipality will be developed into a model municipality with collective cooperation. He also appealed for support beyond political affiliations for development activities.

Municipal Commissioner Pawan Kumar, Councillor Ryakala Neeraj Goud, Panchayat Raj AEE Sana Shaheen, Municipal DEE Spoorthi, Manager Usha, Revenue Inspector Rajeswar Reddy, municipal staff and others participated in the programme.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *