India Retains 3rd Spot in Global Billionaires List; Mukesh Ambani Tops Hurun India Rich List

ప్రపంచ కుబేరుల జాబితాలో భారతదేశం మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. హురున్ నివేదిక ప్రకారం దేశంలో సంపద సృష్టి వేగంగా కొనసాగుతుండగా, భారత పారిశ్రామికవేత్తలు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నారు.
India has retained the third position in the global billionaires list, according to the Hurun report. Wealth creation in the country continues at a rapid pace, with Indian entrepreneurs competing strongly on the global stage.
హురున్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానాన్ని కొనసాగిస్తోంది. దేశంలో సంపద సృష్టి గత కొన్నేళ్లలో వేగంగా పెరుగుతూ వస్తోంది. సంఖ్య పరంగానే కాకుండా, వివిధ రంగాల్లో భారత పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపుతున్నారు.
ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఆయన కుటుంబ సంపద సుమారు 9 శాతం పెరిగి రూ.9.8 లక్షల కోట్లకు చేరిందని హురున్ నివేదిక వెల్లడించింది. ముకేశ్ అంబానీ భారతదేశంతో పాటు ఆసియా మొత్తంలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నాడు. అయితే ప్రపంచ స్థాయిలో ఆయన 17వ స్థానంలో ఉన్నాడు.
భారత కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. వారి కుటుంబ ఆస్తుల విలువ సుమారు రూ.7.5 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. మూడో స్థానంలో హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ ఉన్నారు. ఆమె నెట్వర్త్ సుమారు రూ.3.2 లక్షల కోట్లుగా నమోదైంది. టాప్-10 భారత కుబేరుల జాబితాలో ఉన్న ఏకైక మహిళ కూడా రోష్నీ నాడార్. అయితే గత ఏడాదిలో అదానీ కుటుంబ సంపద 14 శాతం తగ్గగా, నాడార్ సంపద 10 శాతం తగ్గినట్లు నివేదిక తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కూడా ఈ జాబితాలో ప్రాముఖ్యంగా కనిపించారు. దివీస్ లేబోరేటరీస్ చైర్మన్ మురళీ దివి తెలుగు రాష్ట్రాల నుంచి అగ్రస్థానంలో నిలిచారు. ఈసారి పదికిపైగా తెలుగు వ్యాపారవేత్తలు భారత కుబేరుల జాబితాలో చోటు సంపాదించారు.
వారిలో పీ పిచ్చిరెడ్డి (ఎంఈఐఎల్), పీవీ కృష్ణారెడ్డి (ఎంఈఐఎల్), పార్థసారధి రెడ్డి (హెటెరో), అయోధ్య రామిరెడ్డి (రాంకీ గ్రూప్), వెంకటేశ్వరరెడ్డి (అపర్ణ ఎంటర్ప్రైజెస్), కే. సతీశ్ రెడ్డి (డాక్టర్ రెడ్డీస్), జీవీ ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్), బొల్లినేని భాస్కరరావు (కిమ్స్ హాస్పిటల్స్), ప్రతాప్ సీ రెడ్డి (అపోలో హాస్పిటల్స్), రామ్ ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా), జీ రవీందర్ రావు (యశోద హాస్పిటల్స్), ఎం. సత్యనారాయణ రెడ్డి (ఎంఎస్ఎన్ ఫార్మా) వంటి ప్రముఖులు చోటు సంపాదించారు.
According to the latest Hurun report, India has maintained its position as the third-largest hub of billionaires globally. Wealth creation in the country has accelerated significantly in recent years, with Indian entrepreneurs gaining influence across multiple sectors worldwide.
Reliance Industries Chairman Mukesh Ambani continues to top the list of richest individuals in India. The Hurun report states that his family wealth grew by about 9 percent over the past year, reaching nearly ₹9.8 lakh crore. Ambani also remains the richest person in Asia, while he currently ranks 17th in the global billionaire rankings.
The Gautam Adani family secured the second position among India’s richest, with an estimated net worth of around ₹7.5 lakh crore. HCLTech Chairperson Roshni Nadar ranked third with a net worth of approximately ₹3.2 lakh crore. She is also the only woman among India’s top 10 billionaires. However, the report noted that the Adani family wealth declined by 14 percent over the past year, while Roshni Nadar’s wealth saw a 10 percent decrease.
Entrepreneurs from the Telugu states also featured prominently in the list. Divi’s Laboratories Chairman Murali Divi emerged as the richest among Telugu-origin industrialists. More than ten entrepreneurs from the Telugu states have secured positions in India’s billionaire rankings this year.
Notable names include P. Pitchi Reddy and P.V. Krishna Reddy of MEIL, Parthasaradhi Reddy of Hetero, Ayodhya Rami Reddy of Ranky Group, Venkateswara Reddy of Aparna Enterprises, K. Satish Reddy and G.V. Prasad of Dr. Reddy’s Laboratories, Bollineni Bhaskar Rao of KIMS Hospitals, Prathap C. Reddy of Apollo Hospitals, Ram Prasad Reddy of Aurobindo Pharma, G. Ravinder Rao of Yashoda Hospitals, and M. Satyanarayana Reddy of MSN Pharma.