రంగారెడ్డి జిల్లా Ibrahimpatnam పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కథ సుఖాంతమైంది. ఆడుకుంటూ దారి తప్పిన ఏడేళ్ల ఆద్యను పోలీసులు అరగంటలోనే సురక్షితంగా కనిపెట్టారు.

Ibrahimpatnam Police Trace Missing 7-Year-Old Girl Within 30 Minutes

రంగారెడ్డి జిల్లా Ibrahimpatnam పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కథ సుఖాంతమైంది. ఆడుకుంటూ దారి తప్పిన ఏడేళ్ల ఆద్యను పోలీసులు అరగంటలోనే సురక్షితంగా కనిపెట్టారు.

నిజామాబాద్ జిల్లా చిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన అంజలి-రాజు దంపతులు తమ కుమార్తె ఆద్యతో కలిసి బంధువులను కలుసుకోవడానికి ఇబ్రహీంపట్నం వచ్చారు. హాస్టల్ సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఆద్య అనుకోకుండా దారి తప్పి ఎటో వెళ్లిపోయింది.

చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. సిబ్బందిని అప్రమత్తం చేసి, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో శోధన ప్రారంభించారు.

పోలీసుల సమన్వయంతో సాగిన సెర్చ్ ఆపరేషన్ ఫలించింది. కేవలం 30 నిమిషాల్లోనే చిన్నారిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కుమార్తె సురక్షితంగా తిరిగి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. వేగవంతమైన స్పందనతో చిన్నారిని కాపాడిన ఇబ్రహీంపట్నం పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

The incident ended on a positive note in Ibrahimpatnam Police Station limits of Ranga Reddy district. Seven-year-old Adya, who accidentally wandered away while playing, was safely traced by the police within half an hour.

Anjali and Raju, residents of Ravutla village in Chiriconda mandal of Nizamabad district, had come to Ibrahimpatnam to visit relatives along with their daughter. While playing near a hostel, the child lost her way and went missing.

On noticing that their daughter was not around, the parents immediately approached the police and lodged a complaint. A missing case was registered, and the police launched a prompt search operation. Staff were alerted, and technology-assisted tracking methods were deployed.

Within 30 minutes, the police successfully located the child and reunited her with her parents. The family expressed relief and thanked the Ibrahimpatnam police for their swift action and effective coordination.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *