తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Several districts in Telangana are likely to receive moderate to heavy rains accompanied by gusty winds over the next two days, the Meteorological Department has warned.

తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ, రేపు ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Several districts in Telangana are likely to receive moderate to heavy rains accompanied by gusty winds over the next two days, the Meteorological Department has warned.

తెలంగాణలో మళ్లీ వర్షాల ప్రభావం పెరుగుతోంది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన పడటంతో పంటలకు నష్టం వాటిల్లింది. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

A fresh spell of rain has intensified across Telangana. On Monday evening, weather conditions changed abruptly, bringing moderate to heavy rains along with strong winds. Hailstorms were reported in some areas, damaging standing crops. The Meteorological Department stated that thunderstorms and lightning are likely in several districts over the next two days.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరియు పశ్చిమ బెంగాల్ నుంచి తూర్పు కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం బలహీనపడినా, వర్షాల ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు.

Officials attributed the rainfall to a depression formed over the southwest Bay of Bengal and a trough extending from West Bengal to coastal Andhra Pradesh. Though the system has weakened, its impact is expected to continue.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చని వెల్లడించారు.

The Hyderabad Meteorological Centre forecast heavy rainfall in Hyderabad and Rangareddy districts and issued an Orange Alert. Winds may blow at speeds up to 40 kmph, with thunderstorms likely in isolated areas.

జనగాం, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.

Yellow Alert has been issued for Jangaon, Jogulamba Gadwal, Mahabubnagar, Medchal-Malkajgiri, Nagarkurnool, Nalgonda, Narayanpet, Sangareddy, Suryapet, Vikarabad, Wanaparthy and Yadadri Bhuvanagiri districts, where moderate rainfall is expected.

సోమవారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ, అదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. కుమురంభీ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షాలు నమోదయ్యాయి. ఈ వర్షాల కారణంగా వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటలు నేలవాలినట్లు సమాచారం.

Thunderstorms were reported in erstwhile Nalgonda and Adilabad districts on Monday evening. Rainfall was also recorded in Kumurambheem Asifabad, Nirmal, Jagtial, Rangareddy, Siddipet, Kamareddy, Sangareddy, Hyderabad, Yadadri Bhuvanagiri and Bhadradri Kothagudem. Standing crops such as paddy, maize and jowar suffered damage in several areas.

హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు మోస్తరు వర్షం కురిసింది. గంటన్నరపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో ఇవాళ, రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Hyderabad city witnessed moderate rainfall from Monday evening until early Tuesday morning. Strong winds accompanied the showers for nearly an hour and a half, causing inconvenience to commuters. Officials said similar weather conditions are likely over the next two days.

వచ్చే రెండు నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు పంటలను రక్షించుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

The Meteorological Department warned that gusty winds and hailstorms may continue in several districts for the next two to three days and advised farmers to take precautionary measures to protect crops.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *