Kantham Sirisha Krishna Reddy was elected as Chairperson of Aliabad Municipality, assuring fulfilment of poll promises and accessible governance.

మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీకి చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైన అనంతరం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని తెలిపారు.
తనపై విశ్వాసం ఉంచి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు.
Kantham Sirisha Krishna Reddy thanked the voters for electing her and stated that development of civic infrastructure and delivery of basic amenities would be prioritised. She reiterated her commitment to transparent and people-centric administration in Aliabad Municipality.