హైదరాబాద్‌లో పీహెచ్‌ఎఫ్‌ఐ క్యాంపస్‌కు శంకుస్థాపన

English News Headline

Revanth Reddy Lays Foundation Stone for PHFI Hyderabad Campus, Sets June 2, 2028 Completion Deadline

హైదరాబాద్‌లో ప్రజారోగ్య పరిశోధనలు, వైద్య విద్యకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ కొత్త క్యాంపస్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2028 జూన్ 2 నాటికి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించారు.

నవంబర్ 14న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి క్యాంపస్ మాస్టర్ ప్లాన్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సంస్థ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైన సహకారం అందించడంతో పాటు సంస్థకు తాను స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానని ప్రకటించారు.

పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విధానపరమైన గందరగోళం లేదని, పరిశ్రమలకు అవసరమైన భూములు, నీరు, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించినట్లు చెప్పారు.

విద్య, వైద్యం, పరిశ్రమలు, సేవారంగాల్లో తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంలో ఐఎస్‌బీ, నల్సార్ వంటి విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు.

వైద్య రంగానికి రూ.12 వేల కోట్ల పెట్టుబడి

రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సనత్‌నగర్‌లో టిమ్స్ ఆసుపత్రిని ఇప్పటికే ప్రారంభించామని, మిగిలిన టిమ్స్ ఆసుపత్రులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఏటా సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.

ప్రజారోగ్య పరిశోధనలకు ప్రాధాన్యం

ఆరోగ్య రంగంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించి రోగుల వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రాంతాలవారీగా వ్యాధుల తీవ్రతను అంచనా వేసి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలో పీహెచ్‌ఎఫ్‌ఐ వంటి సంస్థలు ప్రజారోగ్య పరిశోధనలు, విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మూసీ కాలుష్యంపై ముఖ్యమంత్రి ఆందోళన

నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో పాటు మూసీ నది కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ నదిని శుద్ధి చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ను విద్య, వైద్యం, పరిశ్రమలు, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో పీహెచ్‌ఎఫ్‌ఐ కొత్త క్యాంపస్ కీలకంగా మారనుంది.

పెట్టుబడుల ఆకర్షణకు గ్లోబల్ సమ్మిట్

తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్ల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

పెట్టుబడులను ఆకర్షించేందుకు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎఫ్‌ఐ చాన్సలర్ డాక్టర్ కె. శ్రీనాథ్ రెడ్డి, ప్రో-చాన్సలర్ ప్రొఫెసర్ సంజయ్ జోడ్పే, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎం. విష్ణువర్ధన్ రావు, పారిశ్రామికవేత్త శ్రీని రాజు, పీహెచ్‌ఎఫ్‌ఐ చైర్మన్ రజత్ గుప్తా, ఇతర వైద్య నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Full English News Article

Hyderabad is set to strengthen its position as a centre for public health education and research with Chief Minister A. Revanth Reddy laying the foundation stone for the new campus of the Public Health Foundation of India’s Institute of Public Health Sciences (PHFI-IPHS).

The Chief Minister also unveiled the campus master plan and set June 2, 2028, as the target for completing and inaugurating the institution. He assured the organisation of full government support and offered to personally serve as its brand ambassador.

Government Assures Support for Investors

Speaking at the foundation stone-laying ceremony on November 14, Revanth Reddy said Telangana had no policy paralysis and remained committed to providing a favourable investment environment.

He said the government had formulated dedicated policies to facilitate land, water, permissions and infrastructure for industries and investors.

The Chief Minister highlighted the role of institutions such as the Indian School of Business (ISB) and NALSAR University of Law in enhancing Hyderabad’s international reputation.

₹12,000 Crore for Healthcare Infrastructure

Revanth Reddy said the Telangana government was spending approximately ₹12,000 crore on developing healthcare infrastructure across the state.

He noted that the TIMS hospital at Sanathnagar had already been inaugurated and that the remaining Telangana Institute of Medical Sciences hospitals would also be made operational.

The government was also constructing a new Osmania General Hospital building at Goshamahal.

He added that approximately ₹2,500 crore was being spent annually through Aarogyasri and the Chief Minister’s Relief Fund.

Focus on Public Health Research

The Chief Minister emphasised the importance of using healthcare data to identify regional disease patterns and improve public health interventions.

He said cancer had been recognised as a notifiable disease and that patient information was being collected.

Data available through Aarogyasri could help identify health problems affecting different regions and support evidence-based healthcare planning.

He expressed confidence that PHFI-IPHS would strengthen Hyderabad’s position in public health education, research and healthcare policy development.

Musi Pollution and Nalgonda Health Concerns

Revanth Reddy expressed concern over the impact of fluoride contamination and pollution in the Musi river on the health of people in Nalgonda district.

He stressed the need to clean and rejuvenate the Musi river to protect public health.

The Chief Minister said public health institutions and research organisations could play an important role in addressing such environmental and health-related challenges.

Invest Telangana Global Summit in December

Revanth Reddy recalled the Telangana Rising 2047 vision aimed at transforming Telangana into a developed state by 2047.

He explained the government’s development strategy through the CURE, PURE and RARE zones.

The Chief Minister announced that the Invest Telangana Global Summit would be held on December 7, 8 and 9 to attract investments and strengthen the state’s industrial and economic growth.

PHFI Chancellor Dr K. Srinath Reddy, Pro-Chancellor Prof. Sanjay Zodpey, Officiating Vice-Chancellor Dr M. Vishnuvardhan Rao, industrialist Srini Raju, PHFI Chairman Rajat Gupta and other medical experts and industrialists attended the event.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *