తెలంగాణ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

English News Headline

Telangana DGP C V Anand Joins Bathukamma Celebrations at Police Headquarters

Full Telugu News Article

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా జరిగాయి. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఈ వేడుకల్లో పాల్గొని మహిళా పోలీసు సిబ్బందితో కలిసి బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు.

వివిధ హోదాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసు సిబ్బంది ఒకేచోట చేరి చప్పట్లు కొడుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడారు. పూల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. రాష్ట్ర సంస్కృతి, ప్రకృతి వైభవాన్ని ప్రతిబింబించే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని డీజీపీ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ, బోనాలు పండుగలకు మరింత విస్తృత గుర్తింపు లభించిందని ఆయన తెలిపారు. చిన్ననాటి బతుకమ్మ జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకున్నారు.

నల్గొండ జిల్లాలోని దోతుగూడెం గ్రామంలో తన అమ్మమ్మ ఊరికి దసరా సెలవుల్లో వెళ్లి ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ జరుపుకునేవాడినని చెప్పారు. తల్లి, బంధువులతో కలిసి గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి వేడుకల్లో పాల్గొన్న రోజులు ఇప్పటికీ ప్రత్యేకంగా గుర్తున్నాయని వివరించారు.

ఈ సందర్భంగా పోలీసు శాఖలోని మహిళా సిబ్బందితో పాటు తెలంగాణ ప్రజలందరికీ డీజీపీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

Full English News Article

Bathukamma celebrations were held at the Telangana Police Headquarters in Hyderabad, with Director General of Police C. V. Anand joining women personnel in celebrating the floral festival.

Women police personnel from different ranks came together, clapped in unison and sang traditional Bathukamma songs, reflecting the cultural heritage and natural beauty associated with Telangana’s festival.

The DGP expressed his happiness at being part of the celebrations and said that Bonalu and Bathukamma had gained wider recognition since the formation of Telangana state.

Recalling his childhood memories, Anand spoke about celebrating Bathukamma during the Dussehra holidays every year at his grandmother’s village, Dothugudem, in Nalgonda district. He remembered going to the village pond with his mother and relatives to take part in the festivities.

He said those childhood experiences continued to hold a special place in his memory.

The DGP extended his Bathukamma greetings to all women personnel of the police force and the people of Telangana.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *