English News Headline
Heatwave Alert in Telangana: Temperatures May Cross 47 Degrees Next Week

Full Telugu News Article
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణ శాఖ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే వారం రోజులు మరింత తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవగా, వచ్చే వారం 45 నుంచి 47 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆదివారం అదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్గొండ, భద్రాద్రి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉదయం 9 గంటల తర్వాతే రోడ్లపై రాకపోకలు తగ్గిపోతున్నాయి. ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. ఎండ తాకిడిని తట్టుకోలేక వ్యాపారులు కూడా మధ్యాహ్నం వేళల్లో దుకాణాలను మూసివేస్తున్నారు.
అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.
ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే పనులు చూసుకోవాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
వైద్యులు కూడా ప్రత్యేక సూచనలు చేశారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు తాగాలని, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వేపుళ్లు, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలని, తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలని చెప్పారు.
ప్రత్యేకంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Full English News Article
Heatwave conditions are intensifying across Telangana as several districts continue to record unusually high temperatures. The Meteorological Department has issued a major warning, stating that the next seven days could be more severe, with temperatures likely to rise further.
Currently, temperatures between 40 and 45 degrees Celsius are being recorded across many parts of the state. Weather officials estimate that temperatures may rise up to 45 to 47 degrees Celsius during the coming week, creating dangerous heatwave conditions.
Adilabad district recorded the highest temperature of 44.5 degrees Celsius on Sunday. Districts including Nizamabad, Jagtial, Kamareddy, Mancherial, Nirmal, Peddapalli, Nalgonda, Bhadradri Kothagudem, and Kumuram Bheem Asifabad also reported temperatures above 44 degrees. Hyderabad recorded 42 degrees Celsius.
Due to the extreme heat, public movement is reducing significantly after 9 AM. Major road junctions and RTC bus stations are appearing deserted, while many traders are temporarily closing shops during afternoon hours to avoid the heat.
The weather department has issued Red Alert for Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Jagtial, Mancherial, Bhupalpally, and Mulugu districts. Orange Alert has been announced for several other districts.
Officials advised people to avoid going outdoors unless absolutely necessary. They recommended completing important work during early morning or evening hours and taking strong precautions if stepping outside during peak heat hours.
Doctors have also advised people to stay hydrated even if they do not feel thirsty. Coconut water, buttermilk, and other fluids are being recommended. People are asked to avoid oily and spicy foods and prefer light, easily digestible meals.
Pregnant women, elderly people, children, and lactating mothers have been urged to remain especially careful during this period of extreme heat