SHE Teams అవగాహన | Child Safety Awareness

ఘట్‌కేసర్ కేంద్రీయ విద్యాలయంలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం
ఘట్‌కేసర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో మేడిపల్లి షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, బాలల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండటంతో పాటు అందుబాటులో ఉన్న భద్రతా సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, లింగ సమానత్వం, మంచి స్పర్శ–చెడు స్పర్శ వంటి అంశాలపై షీ టీమ్స్ సిబ్బంది విద్యార్థులకు వివరించారు.
అలాగే షీ టీమ్స్ అందిస్తున్న సేవలు, CDEW కౌన్సెలింగ్ కేంద్రాలు, T-Safe యాప్ వినియోగం, CCTV కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, వేధింపులు లేదా ఇతర ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
విద్యార్థులు అవగాహనతో అప్రమత్తంగా ఉండి, తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని షీ టీమ్స్ సూచించింది.
అవగాహనతో అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి!
She Teams Conduct Awareness Programme at Ghatkesar Kendriya Vidyalaya
The Medipally SHE Teams conducted an awareness programme for students at Kendriya Vidyalaya in Ghatkesar, covering cybercrime, child safety, drug abuse and other issues. Students were advised to remain alert and make use of available safety services.
During the programme, SHE Teams personnel explained various issues including cybercrime, loan app fraud, human trafficking, child marriages, harassment of children, the harmful effects of drugs, gender equality, and good touch–bad touch.
The students were also briefed about SHE Teams services, CDEW counselling centres, the T-Safe app and the importance of CCTV cameras. They were advised to approach the appropriate authorities without hesitation if they encounter cyber fraud, harassment or any other unsafe situation.
SHE Teams urged students to stay informed and alert, while also contributing to the safety of those around them.
Stay aware. Stay alert. Stay safe!