సూపర్ స్టార్ రజనీకాంత్ కొరకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అటు తమిళనాట, ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందరికి సుపరిచితులు… రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చెనై జనం ఎంతగానో ఆకాంక్షిస్తున్నారు, అయితే గత ఎలెక్షన్లలోనే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అంతబావించారు అయన కూడా వద్దామనే అనుకున్నప్పటికీ , ఆరోగ్య కారణాల వాళ్ళ రాలేక పోయారని తెలిసిందే, కాగా ఈసారి ఆయన రజినీకాంత్ వస్తారోమోనని ప్రజలు చూస్తున్నారు…
ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పై సూపర్ స్టార్ రజనికాంత్ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శనివారం చేనైలో ఓ ఫౌండేషన్ నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో రజనీకాంత్ పాల్గొన్నారు. అలాగే ముఖ్య అతిధిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో వెంకయ్య నాయుడుని ఆదేశించి రజినీకాంత్ మాట్లాడుతూ… గొప్ప నాయుకుడు వెంకయ్య నాయుడుగారిని రాజకీయాల నుండి దూరం చేశారన్నారు. ఆయనకు ఉపరాష్ట్రపతి ఇవ్వటం కన్నా ఆయన కేంద్ర మంత్రిగా కొనిసాగి ఉంటే బావుండేదని అన్నారు. వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వటం తనకు నచ్చలేదని, తద్వారా తనకు కేంద్ర మంత్రి పదవి త్యాగం చేయాల్సి వచ్చిందని అన్నారు.