రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం నుండి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలియావొచ్చింది. కెసిఆర్ ప్రగతి భవన్ నుండి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఏఐజీ చైర్మన్ ప్రముఖ వైద్యుడు నాగేశ్వర్ రావు ఆసుపత్రి బృందంతో కలిసి సీఎంకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ ప్రముఖ వైద్యుడు నాగేశ్వర్ రావు సీఎం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై పత్రిక ప్రకటన విడుదల చేసారు.. కాగా అందులో సీఎం కెసిఆర్ కు కడుపులో చిన్నపాటి అల్సర్ ఏర్పడటంతో అందుకు అవసరమైం వైద్యం అందిస్తున్నామని, అంతకుమించి తనకు కొత్తగా వచినటువంటి సమస్యలు ఏమి లేవని అభిప్రాయపడ్డారు. అయితే సీఎం సతీమణి అస్వస్థతకు గురైనట్లుగా కూడా వార్తలొచ్చాయి, కానీ అందులో వాస్తవం లేదని తెలుస్తోంది.