Xiaomi’s electric SUV YU7 sets the market ablaze with nearly 3 lakh pre-orders in one hour, surpassing expectations and shaking Tesla’s dominance in China. For Technology Telugu News & Telugu Technologies News and English News scroll down

YU7కి ఓ మాస్ స్పందన: షియోమి ఎలక్ట్రిక్ SUVకి గంటలోనే 2.89 లక్షల బుకింగ్స్
చైనాకు చెందిన టెక్ దిగ్గజం షియోమి తన తాజా ఎలక్ట్రిక్ SUV YU7 ద్వారా ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేసింది. బుకింగ్స్ ప్రారంభించిన మొదటి గంటలోనే ఏకంగా 2.89 లక్షల ప్రీ ఆర్డర్లు వచ్చాయి. దీంతో షియోమి షేర్లు హాంకాంగ్ మార్కెట్లో ఆల్‌టైం హైకి చేరుకున్నాయి.
ఈ ఐదు సీటర్ల SUV ధర 2.53 లక్షల యువాన్ (దాదాపు ₹29.5 లక్షలు). ఇది చైనాలో టెస్లా మోడల్ Y కంటే 4 శాతం తక్కువగా ఉంది. అయితే శక్తివంతమైన 760 కిలోమీటర్ల రేంజ్, AI డ్రైవింగ్ అసిస్టెంట్, అపిల్ కార్‌ప్లే, నవిడియా థోర్ చిప్ వంటి ఫీచర్లతో మెరుగైన పనితీరు అందిస్తోంది.
లేయ్ జూన్ ప్రకారం, “మొదటి రెండు నిమిషాల్లోనే 1.96 లక్షల పేమెంట్ ప్రీ ఆర్డర్లు, 1.28 లక్షల లాక్ ఇన్ ఆర్డర్లు వచ్చాయి.. ఇది వండర్ లానే అనిపిస్తోంది” అని చెప్పారు.
బుకింగ్స్ ప్రారంభం తర్వాత వారం నుండి ఐదు వారాల్లో డెలివరీలు మొదలవుతాయని షియోమి ప్రకటించింది. ఈ మోడల్ టెస్లాకు గట్టి పోటీగా మారిందని, దాని వ్యూహాల్లో మార్పులు రానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతేకాకుండా, షియోమి AI ఫీచర్లతో కూడిన స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా విడుదల చేసింది. ధర రూ. 23,000 (యువాన్ 1999). ఫొటో తీయడం, స్కాన్, అనువాదాలు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇది చైనాలో వినియోగ ద్రవ్య విధానాన్ని బలపరిచే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
YU7 debut frenzy: Xiaomi’s electric SUV gets 289,000 orders in an hour, shares hit record high
Chinese tech major Xiaomi shook up the EV sector with its latest launch—the YU7 electric SUV. Within just one hour of opening bookings, Xiaomi recorded an astounding 289,000 pre-orders, pushing its shares to a record high in Hong Kong.
The YU7, priced at 253,500 yuan (approx. ₹29.5 lakh), undercuts Tesla’s Model Y by nearly 4% in China, yet offers superior range (up to 760 km) and high-end features like AI driver assist, Apple CarPlay, Apple Music, and Nvidia’s powerful Thor chip.
Xiaomi’s CEO Lei Jun expressed surprise: “We received 196,000 paid pre-orders and 128,000 lock-in orders in just two minutes. It feels like a miracle,” he stated in a video.
Analysts believe Xiaomi’s aggressive pricing and specifications might intensify the EV price war, pushing even Tesla to rethink its strategy. The deliveries are set to begin in 1 to 5 weeks.
Adding to the tech buzz, Xiaomi also launched AI-powered smart glasses at ¥1,999 ($279), with features like QR scanning, translation, and photography.
This launch aligns with China’s economic strategy to push high-tech consumption, as emphasized by Premier Li Qiang during the World Economic Forum.