
శ్రావణమాసం ప్రారంభమవడంతో ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా మహిళలు లక్ష్మీదేవి పూజలకు క్యూలు కట్టారు.
With the onset of the holy month of Shravan, temples witnessed large gatherings, particularly women lining up to offer prayers to Goddess Lakshmi.
బ్రహ్మంగారిమఠం: శ్రావణమాసం శుక్రవారం లక్ష్మీదేవి పూజలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సిరిసంపదలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం పవిత్రంగా భావించబడుతుంది. ముఖ్యంగా మొదటి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించడం విశేష ఫలితాలు ఇస్తుందని భావిస్తారు.
ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. ముత్తైదువులకు తాంబూలం సమర్పించడం, తామర పూల మాలను సమర్పించడం ఆర్థిక ఇబ్బందులను తొలగించి, సుఖశాంతులు కలిగిస్తుందని నమ్మకం.
లక్ష్మీ పూజా విధానం:
లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరించాలి. అమ్మవారికి ఇష్టమైన పువ్వులు, పండ్లు, నైవేద్యాలు సమర్పించాలి. లక్ష్మీ స్తోత్రాలు, శ్లోకాలు పఠించాలి. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాలు పొందాలి. చివరగా ప్రసాదాన్ని పంచుకుని ఉపవాసాన్ని విరమించాలి.
Devotees believe that worshipping Goddess Lakshmi on the first Friday of Shravan brings prosperity, good health, and happiness. Temples across the region saw women performing special rituals, offering flowers and fruits, and reciting sacred chants. Varalakshmi Vratam, observed on this day, is considered highly auspicious.