We will build Amaravati as a beautiful green city, said CM Chandrababu Naidu at the Investopia Global AP Summit held in Vijayawada…సుందరమైన హరిత నగరంగా

సుందరమైన హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం – ఇన్వెస్టోపియా గ్లోబల్‌ సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టత

We will build Amaravati as a beautiful green city, said CM Chandrababu Naidu at the Investopia Global AP Summit held in Vijayawada.

అమరావతిని ప్రపంచ స్థాయిలో హరిత నగరంగా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్‌ ఏపీ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వివరించారు.

ఈ సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు మాట్లాడుతూ, “యూఏఈ మంత్రిని స్వయంగా దావోస్‌లో కలసి ఏపీకి ఆహ్వానించాను. భారత్‌లో ఏపీని చూసిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని కోరాను. ఆ ఆహ్వానానికి స్పందిస్తూ వారు ఇక్కడికి వచ్చి ఇన్వెస్టోపియా సదస్సు నిర్వహించారు” అని తెలిపారు.

దుబాయ్ అభివృద్ధిని ఉదహరిస్తూ, 50 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఇంటర్నెట్ సిటీ నిర్మించినట్లు గుర్తు చేస్తూ, “అదే ప్రేరణతో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ప్రారంభించాం. ఇప్పుడు హైదరాబాద్ దేశంలో మోస్ట్ లివబుల్ సిటీగా మారింది” అన్నారు.

యూఏఈ జనాభాలో 38 శాతం మంది భారతీయులే ఉన్నారని, అందులో తెలుగు ప్రజల వాటా కూడా గణనీయమని తెలిపారు. యూఏఈ భారతీయులకు అవకాశాలను కల్పిస్తుండగా, భారతీయులు ఆ దేశానికి సేవలు అందిస్తున్నారని అన్నారు.

భారత ఆర్థిక స్థితిగతులపైనా చంద్రబాబు విశ్లేషణ ఇచ్చారు. “2024-25లో భారత్–యూఏఈ మధ్య 100 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరిగింది. అందులో ఏపీ-యూఏఈ మధ్య 1.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. భారత్ ప్రస్తుతం నాల్గో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ. 2029 నాటికి మూడో స్థానానికి, 2047 నాటికి ప్రథమ స్థానానికి చేరుతుందని ఆశిస్తున్నాం” అని చెప్పారు.

టెక్నాలజీ రంగంలో భారతీయుల ప్రాధాన్యతను చెబుతూ, “ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు టెక్ నిపుణుల్లో ఒకరు భారతీయుడే. ఆ భారతీయుల్లో ఇద్దరు తెలుగువాళ్లే ఉంటారు. బలమైన పాలసీ ద్వారా సంపద సృష్టించేవారిలో 33 శాతం తెలుగువారే” అని పేర్కొన్నారు.

Chief Minister Chandrababu Naidu has stated that Amaravati will be developed as a world-class green city. Speaking at the Investopia Global AP Summit held in Vijayawada, he outlined his vision and the steps taken to attract international collaboration.

He said, “I met the UAE Minister at Davos and personally invited him to visit Andhra Pradesh. I requested him to explore AP first before going to other Indian states. Respecting our invitation, the UAE delegation conducted the Investopia Summit here.”

Highlighting Dubai’s transformation, he said, “They turned a desert into a paradise. Despite extreme conditions like 50-degree heat, they built Internet City. Inspired by that, we developed Hitech City in Hyderabad, which is now ranked among the most livable cities in India.”

He mentioned that 38% of UAE’s population consists of Indians, and among them, a significant number are Telugu people. “UAE is providing opportunities for Indians, and in return, Indians are offering valuable services to that nation,” he added.

On India’s economic journey, Chandrababu said, “India and UAE conducted $100 billion in trade during 2024–25, and AP alone contributed $1.5 billion to that. India is currently the 4th largest economy. By 2029, we aim to become the 3rd largest, and by 2047, we aspire to be number one.”

He emphasized the dominance of Indians in the global tech sector: “One out of every four global tech professionals is Indian. Among Indians, every second person is a Telugu individual. Also, 33% of the top wealth creators in India, backed by strong public policy, are Telugu people.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *