Warner and Bairstow lit up the game, but Williamson’s side clinched an 8-run win…వార్నర్, బెయిర్‌స్టో

Image: Screenshot from ‘ https://www.google.com/                ” (used under fair use for reporting)

వార్నర్, బెయిర్‌స్టో మెరుపులు మైదానాన్ని కదిలించినా… విలియమ్సన్ సేన ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది.
Warner and Bairstow lit up the game, but Williamson’s side clinched an 8-run win.

కార్డిఫ్‌లో జరిగిన ది హండ్రెడ్ లీగ్ మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ జట్టు వెల్ష్ ఫైర్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన స్పిరిట్ తరఫున ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూకుడు ప్రదర్శించాడు. 45 బంతుల్లో రెండు సిక్సులు, ఎనిమిది ఫోర్లతో అజేయంగా 70 పరుగులు చేసి జట్టును 163/5కి చేర్చాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 14, జెమీ స్మిత్ 26, ఆస్టన్ టర్నర్ 24 పరుగులు చేశారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో జోష్ హల్ రెండు వికెట్లు తీశాడు.

163 లక్ష్యంతో బరిలోకి దిగిన వెల్ష్ ఫైర్‌కు వికెట్‌కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ఆరంభం నుంచే దంచికొట్టాడు. 50 బంతుల్లో ఆరు సిక్సులు, ఆరు ఫోర్లతో అజేయంగా 86 పరుగులు సాధించాడు. కానీ మరో ఎండ్‌లో మద్దతు లేకపోవడంతో జట్టు 155/6కే పరిమితమైంది. స్టీవ్ స్మిత్ (3), టామ్ ఏబెల్ (5) వంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. స్పిరిట్ బౌలర్లలో డేనియల్ వొరాల్ రెండు వికెట్లు తీయగా, లూక్ వుడ్, రిచర్డ్ గ్లీసన్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్ చెరో వికెట్ పడగొట్టారు.

With a thrilling finish at Cardiff’s Sophia Gardens, London Spirit edged out Welsh Fire by 8 runs in The Hundred League 2025. Batting first after losing the toss, Spirit were propelled by former Australia opener David Warner’s explosive 70* off 45 balls, featuring two sixes and eight fours, taking the team to 163/5. Captain Kane Williamson scored 14, Jamie Smith 26, and Aston Turner 24, while Josh Hull took two wickets for Welsh Fire.

Chasing 164, wicketkeeper-batter Jonny Bairstow led Welsh Fire’s charge with an unbeaten 86 off 50 balls, hitting six sixes and six fours. However, lack of support from the other end saw the team finish at 155/6. Steve Smith (3) and Tom Abell (5) failed to contribute significantly. For Spirit, Daniel Worrall picked two wickets, while Luke Wood, Richard Gleeson, Jamie Overton, and Liam Dawson claimed one each.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *