
బాలికల్లో మేధాశక్తి అభివృద్ధికి ‘హర్ వాయిస్’ ప్రత్యేక శిక్షణ | Voice-4 conducts awareness for girl students on intelligence and safety
తమ మేధాశక్తిని పెంపొందించుకుని, సమాజంలో విశ్వాసంతో ముందడుగు వేయాల్సిన అవసరం బాలికల్లో ఉందని Voice-4 సంస్థ అవగాహన కల్పిస్తోంది.
జమ్మికుంటలోని టీజీఎంఆర్‌ఈఐఎస్ బాలికల పాఠశాలలో జూలై 10 నుండి 19 వరకు Voice-4 సంస్థ ఆధ్వర్యంలో ‘హర్ వాయిస్ పరిచయ్’ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంస్థ ఫీల్డ్ కో-ఆర్డినేటర్ అనుష్క యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, 7వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న 145 మంది విద్యార్థినులకు సమాజంలో ఎలా ప్రవర్తించాలి, నడవడిక ఎలా ఉండాలి, వ్యక్తిగత రక్షణ ఎలా పాటించాలి వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడింది.
ఈ కార్యక్రమానికి Voice-4 ఫౌండర్ అనూష భరద్వాజ్ నేతృత్వం వహిస్తున్నారు. బాలికలలో మేధాశక్తిని అభివృద్ధి చేయడం, అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించేందుకు కావాల్సిన సామర్థ్యాన్ని అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బాలికల కోసం వివిధ అంశాలపై ఈ సంస్థ కార్యక్రమాలు చేపడుతోంది.
ఈ అవగాహన శిక్షణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఇది మేలైన వేదికగా నిలిచిందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.