Vijay Antony’s upcoming film ‘BhadraKaali’ promises a fresh take on political thrillers and is set for release on September 5, offering audiences a new cinematic experience..’భద్రకాళి’ రాజకీయ

‘భద్రకాళి’ రాజకీయ థ్రిల్లర్‌గా వినూత్నంగా రూపొందిన చిత్రమని, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని హీరో విజయ్ ఆంటోని చెప్పారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vijay Antony’s upcoming film ‘BhadraKaali’ promises a fresh take on political thrillers and is set for release on September 5, offering audiences a new cinematic experience.

తమిళ నటుడు విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ‘భద్రకాళి’ సినిమా సెప్టెంబర్ 5న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘మార్గన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాతో ఇంకొంత విభిన్నంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను రామాంజనేయులు జవ్వాజీ నిర్మించగా, సురేష్ బాబు సపోర్టుతో తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేయనుంది.

ఫైర్‌తో నిండిన కథ, హై ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రంలో, హీరో విజయ్ ఆంటోని ద్విహస్త ధానుశధారి వేషధారణలో పోస్టర్‌లో కనిపించారు. కోపంతో నిండి ఉన్న పాత్ర ఈ సినిమా ఫీల్‌ను ముందుగానే తెలియజేస్తోంది. దర్శకుడు అరుణ్ ప్రభు మాట్లాడుతూ ఇది తన తొలి తెలుగు సినిమా అని, ఈ సినిమా రాజకీయ వ్యవస్థపై ప్రభావవంతంగా ముద్ర వేస్తుందన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని తెలిపారు.

ప్రెస్ మీట్‌లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ “ఇది నా 25వ సినిమా. ఇప్పటివరకు వచ్చిన పొలిటికల్ సినిమాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా మీ అందరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది,” అన్నారు. ప్రొడ్యూసర్ రామాంజనేయులు మాట్లాడుతూ “వినోదంతో పాటు సామాజికంగా ముఖ్యమైన అంశాలను చూపించాం. ఇది విజయ్ ఆంటోని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుంది,” అన్నారు. మరో నిర్మాత ధనంజయన్ మాట్లాడుతూ “సురేష్ బాబు ప్రెజెంటేషన్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. మార్గన్ హిట్ కావడంలో అది ముఖ్యపాత్ర వహించింది,” అన్నారు.

ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతాన్ని అందించగా, కెమెరామెన్ షెల్లీ కాలిస్టా, ఎడిటర్ రేమండ్ డెరిక్, ఫైట్ మాస్టర్ రాజశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ శ్రీరమన్, డైలాగ్స్ రైటర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు టెక్నికల్ టీమ్‌లో పనిచేశారు. తృప్తి రవీంద్ర హీరోయిన్‌గా నటించింది.

Vijay Antony’s ‘BhadraKaali’ to Release on September 5 — A Fierce Political Thriller with a Rugged New Look

Vijay Antony’s upcoming film ‘BhadraKaali’ promises a fresh take on political thrillers and is set for release on September 5, offering audiences a new cinematic experience.

Tamil actor Vijay Antony is all set to entertain Telugu audiences once again with his latest film BhadraKaali, hitting theatres on September 5. After earning acclaim for films like Mark Antony, the actor is now ready to explore a more intense, politically-driven storyline. Directed by Arun Prabhu, this rugged political action thriller is produced by Ram Anjaneyulu Javvaji, while the Telugu version is being presented by Asian Suresh Entertainment, backed by producer Suresh Babu.

The film is packed with fiery storytelling and high-intensity action sequences. The poster features Vijay Antony in a fierce dual-sword warrior look, hinting at the emotional and political intensity of the character. Director Arun Prabhu stated this is his debut Telugu film and assured that the movie will leave a significant mark on how political systems are portrayed on screen. He expressed confidence that it will appeal to audiences across all sections.

During a press meet, Vijay Antony said, “This is my 25th film. It’s completely different from any political thriller made before. The audience will experience something unique through this film.”

Producer Ram Anjaneyulu added, “The film mixes solid entertainment with important social issues. It will be a milestone in Vijay Antony’s career.” Co-producer Dhananjayan said, “Suresh Babu’s presentation will give this movie a huge edge in Telugu. His support helped ‘Mark Antony’ succeed too.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *