
విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మార్గన్’ విజయానంతరం ఆయన నుంచి వస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలు సృష్టించింది.
Vijay Antony’s intense political action thriller BhadraKali is set for release on September 19, riding on the success wave of his earlier hit Mark Antony. The film has generated strong buzz across Telugu and Tamil audiences.
‘భద్రకాళి’ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్‌తో ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.
The movie is produced by Ramam Janeyulu Juvvaji under Servant Ram Creations and presented by Vijay Antony Film Corporation & Meera Vijay Antony. Asian Suresh Entertainment is releasing the Telugu version, with additional backing from Rana Daggubati’s Spirit Media. The teaser has already drawn strong positive response from audiences.
ఈ చిత్రంలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. టెక్నికల్ టీమ్‌లో షెల్లీ కాలిస్ట్ సినిమాటోగ్రఫీ, విజయ్ ఆంటోనీ సంగీతం, రేమండ్ డెరిక్ ఎడిటింగ్, రాజశేఖర్ యాక్షన్, శ్రీరమన్ ఆర్ట్ డైరెక్షన్, రాజశేఖర్ రెడ్డి తెలుగు డైలాగ్స్ అందించారు.
The cast also includes Vagai Chandrasekhar, Sunil Krishnapani, Cell Murugan, Tripti Ravindra, Kiran, Rini Bot, Riya Jithu, and Master Keshav. Key crew members include Shelly Calist (cinematography), Vijay Antony (music), Raymond Derrick (editing), Rajasekhar (stunts), and Sriraman (art direction). Telugu dialogues are penned by Rajashekar Reddy.