త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి”: బ్రెస్ట్ క్యాన్సర్ పై జాతీయ అవగాహన ప్రచారానికి ఉపాసన శ్రీకారం

Upasana Konidela Launches National Breast Cancer Awareness Campaign with Fujifilm and Apollo Foundation for English News scroll Down to read the telgu Tollyowood news

త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి”: బ్రెస్ట్ క్యాన్సర్ పై జాతీయ అవగాహన ప్రచారానికి ఉపాసన శ్రీకారం

హైదరాబాద్, జూన్ 11, 2025 – రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడమే లక్ష్యంగా, ఫ్యూజీఫిలిం ఇండియా మరియు అపోలో ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన జాతీయ స్థాయి సీఎస్ఆర్ ప్రచారాన్ని ఉపాసన కామినేని కొణిదెల ప్రారంభించారు. “Find it Early. Fight it Early” అనే నినాదంతో ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారానికి ఉపాసన ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.

ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 24 నగరాల్లో నిర్వహించబోతున్నారు. లక్ష్యం – 1.5 లక్షల మహిళల వరకు చేరుకోవడం, ముఖ్యంగా పేదప్రాంతాలు, పట్టణ శివార్ల బస్తీలు, తక్కువ ఆదాయ గల కుటుంబాల్లో మహిళలకు బ్రెస్ట్ హెల్త్ గురించి అవగాహన కల్పించడం.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ:

“ఇది దానం కాదు, మా బాధ్యత. మహిళలు భయపడకుండా గౌరవంగా జీవించాలి. రొమ్ము ఆరోగ్యం గురించి అందరితో బహిరంగంగా చర్చించే సమయం ఇది. ఇది ఆరోగ్య విప్లవానికి మొదటి అడుగు.”

భయంకరమైన గణాంకాలు:

  • ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం
  • 50% పైగా కేసులు చివరి దశలో గుర్తించబడతాయి
  • ప్రతి 4 నిమిషాలకు ఒక కేసు నమోదు, ప్రతి 13 నిమిషాలకు ఒక మరణం

ఈ ప్రచారం ద్వారా వర్క్‌షాపులు, అవగాహన సమావేశాలు, స్క్రీనింగ్‌ కార్యక్రమాలు, డోర్ టు డోర్ అవుట్ రీచ్ నిర్వహించనున్నారు. ఉపాసన పేర్కొన్న విధంగా, ఆరోగ్యంపై సాంఘిక మార్పుకు టెక్నాలజీ సహాయపడాలన్నదే వారి లక్ష్యం.

ఫ్యూజీఫిలిం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజి వాడా మాట్లాడుతూ:

“అవగాహనతో బ్రెస్ట్ క్యాన్సర్‌ను త్వరగా గుర్తించి నివారించవచ్చు. ప్రతి మహిళకు సమానమైన ఆరోగ్య సంరక్షణ అందాల్సిన సమయం ఇది.”

Find it Early. Fight it Early”: Upasana Konidela Launches Pan-India Breast Cancer Awareness Campaign

Hyderabad, June 11, 2025 – In a powerful move to raise awareness about breast cancer, Fujifilm India and Apollo Foundation launched the national CSR campaign ‘Find it Early. Fight it Early’. The campaign was inaugurated by Upasana Kamineni Konidela, Vice Chairperson of Apollo Hospitals CSR division, who will also serve as the official campaign ambassador.

The campaign targets 24 cities across India and aims to reach over 1.5 lakh women, especially in underprivileged communities and rural areas. Trained field staff will educate women on breast health, early detection, and the importance of regular screenings.

This is not charity; it is our responsibility,” said Upasana at the event. “We want women to live with dignity, without fear. Breast health should be as openly discussed as blood sugar or blood pressure.”

The campaign launch highlighted alarming statistics:

  • 1 in every 29 Indian women is at risk of developing breast cancer.
  • Over 50% of breast cancer cases are diagnosed at late stages.
  • Every 4 minutes, a woman is diagnosed; every 13 minutes, one dies from breast cancer in India.

The initiative will conduct screenings, workshops, public awareness drives, and door-to-door outreach in slum clusters and semi-urban zones. Fujifilm India’s MD Koji Wada emphasized their commitment to delivering equitable healthcare access through this campaign under their Sustainable Value 2030 Plan.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *