TNGO leaders consoled ACP Madhavi in Karimnagar after the sudden demise of her husband, DSP Mahesh Babu…హుజురాబాద్ ఏసీపీ

హుజురాబాద్ ఏసీపీ మాధవిని ఆమె భర్త మరణం అనంతరం పరామర్శించిన టీఎన్జీవో నాయకులు. TNGO leaders consoled ACP Madhavi in Karimnagar after the sudden demise of her husband, DSP Mahesh Babu.

కరీంనగర్: హుజురాబాద్ ఏసీపీ మాధవి భర్త, పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న మహేశ్ బాబు ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు మరియు జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు మాధవిని కలిసి పరామర్శించారు.

మహేశ్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వారు… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని తట్టుకోగల శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

పరామర్శకు హాజరైనవారిలో టీఎన్జీవో కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు ఒంటెల రవీందర్ రెడ్డి, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మేందర్ సింగ్, ఉపాధ్యాయ నాయకులు చంద్రశేఖర్, గంగారపు రమేష్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, సభ్యులు రాజ మల్లయ్య, వెంకట్ రెడ్డి, కోటేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *