The teaser of Suriya’s upcoming mass entertainer ‘Karuppu’ released on his birthday has left fans thrilled. Directed by RJ Balaji, this magnum opus promises high-octane visuals and mass appeal, with Suriya in a powerful avatar…సూర్య పుట్టినరోజు

సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘కరుప్పు’ టీజర్‌ అంచనాలను పెంచేసింది. మాస్‌ లుక్‌లో సూర్య అద్భుతంగా మెరిశారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు టెక్నికల్ టీమ్ బలంగా ఉండటం విశేషం.

The teaser of Suriya’s upcoming mass entertainer ‘Karuppu’ released on his birthday has left fans thrilled. Directed by RJ Balaji, this magnum opus promises high-octane visuals and mass appeal, with Suriya in a powerful avatar.

తమిళ స్టార్ హీరో సూర్య 45వ చిత్రం ‘కరుప్పు’తో మాస్ మోదే ప్రారంభమైంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో భారీగా రూపొందుతున్న ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ టీజర్ సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. టీజర్‌లో సూర్య పవర్‌ఫుల్ మాస్ లుక్‌, ఫైర్ విజువల్స్‌, స్టన్నింగ్ బీజీఎం తో రికార్డులు తిరగరాయనున్న అంచనాలు నెలకొన్నాయి. 1 నిమిషం 38 సెకన్ల టీజర్‌లో మాస్‌ మోమెంట్స్‌, స్టైలిష్ యాక్షన్‌, గ్రాండ్ సినిమాటోగ్రఫీని GK విష్ణు అందించారు.

సోషల్ థీమ్‌లు తెరకెక్కించడంలో ప్రావీణ్యం కలిగిన RJ బాలాజీ, ఈసారి సూర్యతో కలసి స్ట్రాంగ్ మాస్ కమర్షియల్ సినిమా తీసుకొచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణ. అరుణ్ వెంజరాముడు ప్రొడక్షన్ డిజైన్‌ విజువల్స్‌కి డెప్త్ ఇచ్చింది. ఎడిటింగ్‌లో కలైవాణన్ పనితనం టీజర్‌కు స్పీడ్ తీసుకొచ్చింది. యాక్షన్ మాస్టర్స్ అన్బరివ్, విక్రమ్ మోర్ డిజైన్ చేసిన ఫైట్లు మాస్ ఆడియన్స్‌ను మెప్పించనున్నాయి.

త్రిష పాత్ర ఇంకా రివీల్ కాలేదు. థియేట్రికల్ ట్రైలర్ కోసం దానిని హోల్డ్ చేశారు. క్యాస్టింగ్‌లో ఇంద్రన్స్, స్వసిక, అనఘ మాయ రవి, శివదా, నట్టి, సుప్రీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ టీజర్ చూస్తే ‘కరుప్పు’ మాస్ ప్రేక్షకులకు పండుగ కానుకగా ఉండబోతుందన్న విషయం స్పష్టం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *