
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకం నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పథకానికి శ్రీకారం చుట్టారు.
The ‘Sthree Shakti’ scheme, offering free bus travel for women in Andhra Pradesh, began today. Chief Minister Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan, and Minister Nara Lokesh launched the scheme by personally travelling in an RTC bus.
ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్టాండ్ వరకు ప్రయాణిస్తూ, నేతలు మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి ఆనందాన్ని పంచుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులు, నినాదాలతో స్వాగతం పలికారు.
Travelling from Undavalli to Vijayawada Bus Stand via Tadepalli and Kanaka Durga Varadhi, the leaders interacted with women passengers and shared their joy. BJP State President Madhav and other alliance leaders joined the journey. Women along the route welcomed them with traditional rituals and slogans.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటైన ఈ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలలో సంతోషం వ్యక్తమవుతోంది. కూటమి కార్యకర్తలు పలు చోట్ల బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు.
The scheme, one of the key election promises, has brought cheer to women across the state. Alliance workers celebrated with firecrackers in several places.