
సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించడంతో చైల్డ్ ట్రాఫికింగ్, మనీలాండరింగ్ ఆరోపణలు మరింత తీవ్రత సంతరించుకున్నాయి.
The ED’s entry into the Srushti Fertility case has intensified allegations of child trafficking and money laundering.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలపై ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కార్యకలాపాలు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించినట్లు గుర్తించారు. నిరుపేద కుటుంబాల పిల్లలను కొనుగోలు చేసి, సంతానం లేని వారికి విక్రయించడం, నకిలీ సరోగసి-ఐవీఎఫ్ ధ్రువపత్రాలు సృష్టించడం, ఈ దందాలో ఆమె భర్త సురేశ్, చెల్లి కీర్తి, పలువురు ఉద్యోగులు పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలింది.
పిల్లల కొనుగోలుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి, వారిని రూ.20–40 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. హవాలా మార్గం సహా వివిధ మార్గాల ద్వారా రూ.40 కోట్ల వరకు మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు 86 మంది పిల్లలు ట్రాఫికింగ్‌కు గురైనట్లు తేలింది. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో ఇటీవల అరెస్టైన ముగ్గురు దళారులకు డాక్టర్ నమ్రతతో సంబంధాలున్నట్లు కూడా బయటపడింది.
ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ఈడీ ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలపై దృష్టి సారించింది. పోలీసు విచారణ, ఈడీ దర్యాప్తు పూర్తయ్యే సరికి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
The Enforcement Directorate (ED) has stepped into the sensational Srushti Fertility Centre case in Secunderabad, which rocked both Telugu states. Acting on allegations of large-scale child trafficking and money laundering, the ED has written to Hyderabad police seeking case details. Investigations revealed that prime accused Dr. Namrata operated across eight states, purchasing children from poor families and selling them to childless couples using fake surrogacy and IVF certificates. Her husband Suresh, sister Keerthi, and several employees were allegedly involved.
Police found that children were bought for ₹1.5–2 lakh and sold for ₹20–40 lakh, with money laundered through multiple channels, including hawala, amounting to nearly ₹40 crore. A total of 86 children were trafficked. Recently, three brokers arrested at KGH in Visakhapatnam were found to be linked to Dr. Namrata.
With the ED now focusing on her financial transactions and assets, the case has entered a crucial phase. More shocking details are expected once both police and ED complete their investigations.