Telugu News Headlineఎండల తీవ్రతపై హెచ్చరికలు

English News Headline
Heatwave Alert in Telangana: Temperatures to Touch 44°C in Multiple Districts


Full Telugu News Article

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రేపటి నుంచి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఏప్రిల్ ప్రారంభంలోనే భానుడు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాడు. ఉదయం నుంచే మండే ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశంలో మేఘాలు కనిపించినప్పటికీ, ఎలాంటి చల్లదనం లేకపోవడంతో వేడి మరింత ఎక్కువగా అనిపిస్తోంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా 40–41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితి ఏప్రిల్ 22 వరకు కొనసాగవచ్చని సూచించారు.

వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని సూచించింది. తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

గత వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. నల్గొండ జిల్లా ఘనపూర్‌లో 41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


Full English News Article

Heatwave conditions are intensifying across Telangana, with the weather department issuing warnings that temperatures may touch up to 44°C in several districts starting tomorrow.

The rising heat has become severe from early April itself, with scorching conditions from morning hours. Despite the presence of light clouds, there is no significant cooling effect, making the weather feel extremely hot.

According to the Hyderabad Meteorological Centre, most districts in Telangana are likely to record temperatures above 40°C. In some regions, maximum temperatures may reach up to 44°C in the coming days.

In Hyderabad city, temperatures are expected to hover between 40°C and 41°C. Officials indicated that these heatwave conditions may continue until April 22.

Authorities have advised people to avoid stepping out during peak afternoon hours. If necessary, citizens are urged to take precautions to prevent heatstroke, especially children and elderly individuals.

Over the past week, temperatures have steadily increased. Nalgonda district recorded one of the highest temperatures at 41.8°C, with over 27 districts already crossing the 40°C mark.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *