English News Headline
Telangana High Court Rules No Vehicle Seizure in Drunk Driving Cases

Full Telugu News Article
హైదరాబాద్, తెలంగాణలో డ్రంకన్ డ్రైవ్ కేసులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి వాహనం నడిపిన కేసుల్లో పోలీసులు వాహనాలను సీజ్ చేయకూడదని స్పష్టం చేసింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు తేలితే కేసు నమోదు చేయవచ్చని, కానీ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని కోర్టు తెలిపింది. రవాణా శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్‌కు చెందిన వాహన యజమాని పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి డ్రైవ్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు కానీ వాహనాన్ని సీజ్ చేయడం చట్టబద్ధం కాదని పేర్కొంది.
పోలీసులు మూడు రోజుల్లోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. వాహనానికి సంబంధించిన పత్రాలు సమర్పిస్తే యజమానికి వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశించింది.
డ్రైవర్ మద్యం సేవించి ఉంటే అతనికి వాహనం నడిపేందుకు అనుమతి ఉండదని, అతనితో ఉన్న మద్యం సేవించని లైసెన్స్ ఉన్న వ్యక్తికి వాహనం అప్పగించాలని కోర్టు తెలిపింది. ఎవరూ లేని పరిస్థితిలో బంధువులు లేదా స్నేహితులకు సమాచారం ఇచ్చి వాహనం ఇవ్వాలని సూచించింది.
మోటారు వాహనాల చట్టం ప్రకారం మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాలని, తెలంగాణ మోటర్ వెహికిల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో కీలక మార్పుకు దారి తీసే అవకాశం ఉంది.
Full English News Article
In Hyderabad, Telangana, the Telangana High Court has issued key directions regarding drunk driving cases, stating that police do not have the authority to seize vehicles solely on the grounds of drunk driving.
The court clarified that while police can register a case if a driver is found under the influence of alcohol, they cannot confiscate the vehicle. Authorities must strictly follow the provisions under the Motor Vehicles Act and related rules.
The order came while hearing a petition filed by a vehicle owner from Hyderabad who challenged the seizure of his vehicle in a drunk driving case. The court ruled that legal action can be taken against the driver, but seizure of the vehicle is not justified under the law.
The High Court also directed that a charge sheet must be filed within three days in such cases. If valid documents like RC and driving licence are produced, the vehicle should be released to the owner.
Further, the court stated that a person caught drunk should not be allowed to drive, and the vehicle must be handed over to a sober licensed person accompanying them. If no such person is available, relatives or friends should be contacted to take custody of the vehicle.
The court emphasized that police must strictly adhere to Telangana Motor Vehicle Rules, 1989. This ruling is expected to impact enforcement practices in drunk driving cases across Telangana.