ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024..

Telangana Gaddar Film Awards 2024 Held Grandly at Hyderabad HICC for Telugu News and English News kindly scroll down

ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024

హైటెక్స్, హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది

హైదరాబాద్, జూన్ 14 – రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హైటెక్స్‌లో “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” వేడుక అత్యంత వైభవంగా, కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, 2014–2024 దశాబ్దంలో చలనచిత్ర రంగానికి విశేష కృషి చేసిన ప్రముఖులను సత్కరించారు.

14 ఏళ్ల విరామం తర్వాత ప్రజా ప్రభుత్వమంతట వారు ఈ అవార్డులను పునరుద్ధరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా సినిమాకు కృషిచేసిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు బహుమతులు అందజేయడంతో పాటు, ప్రసిద్ధ వైతాళికుల పేరుతో ప్రత్యేక అవార్డులు కూడా ఇచ్చారు.

ప్రధాన అవార్డులు:

  • ఎన్టీఆర్ జాతీయ అవార్డు – నందమూరి బాలకృష్ణ
  • పైడి జయరాజ్ అవార్డు – మణిరత్నం
  • బీఎన్ రెడ్డి అవార్డు – శ్రీ సుకుమార్
  • నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు – అట్లూరి పూర్ణచందర్ రావు
  • కాంతారావు అవార్డు – విజయ్ దేవరకొండ
  • రఘుపతి వెంకయ్య అవార్డు – యండమూరి వీరేంద్రనాథ్
  • ఉత్తమ నటుడు – అల్లు అర్జున్
  • ఉత్తమ నటి – నివేదా థామస్

అంతేకాకుండా ఆస్కార్ విజేతలు చంద్రబోస్ గారు, ఎంఎం కీరవాణి గారులను ఘనంగా సత్కరించారు. ప్రజా గాయకుడు గద్దర్ గారి జయంతి సందర్భంగా ₹3 కోట్ల విలువైన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ – సూర్యకిరణ్ కు సీఎం గారు అందజేశారు.

సినీ పరిశ్రమ శ్రేయస్సు కోసం గద్దర్ గారి పేరుతో అవార్డుల పునరుద్ధరణకు సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Hyderabad, June 14 – The prestigious Telangana Gaddar Film Awards – 2024 were held in grandeur at HICC, Hyderabad. Honoring cinematic excellence, the event was graced by Chief Minister Revanth Reddy, who personally presented the awards to prominent artists and technicians for their contributions between 2014 and 2024.

Reviving the awards after 14 years, the Telangana Government not only reinstated the core film honors but also introduced special awards in the name of legendary filmmakers.

Among the major recognitions:

  • NTR National Award – Nandamuri Balakrishna
  • Paidi Jayaraj Award – Mani Ratnam
  • BN Reddy Award – Director Sukumar
  • Nagireddy–Chakrapani Award – Atluri Poornachandra Rao
  • Kanta Rao Award – Vijay Deverakonda
  • Raghupathi Venkaiah Award – Yandamuri Veerendranath
  • Best Actor – Allu Arjun
  • Best Actress – Nivetha Thomas

Oscar winners Chandrabose and MM Keeravani were felicitated, and a ₹3 crore grant document was handed over to Gaddar Foundation – Suryakiran.

Cine stars expressed gratitude to the government for reviving the awards in memory of Praja Gāyakuḍu Gaddar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *