
తెలంగాణ కేబినెట్ ఆగస్టు 4న సమావేశం కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు ఈ ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు.
Telangana Cabinet is scheduled to meet on August 4 to discuss the Kaleshwaram Commission report in a special session.
తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 4న జరగనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులపై ఏర్పాటైన కమిషన్ నివేదికను పరిశీలించేందుకు ఈ భేటీ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ కమిషన్ నివేదికను అధ్యయనం చేయాల్సిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీటిపారుదల శాఖ, న్యాయశాఖ, జీఏడీ శాఖ సెక్రటరీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ తమ అధ్యయన నివేదికను ఆగస్టు 4న మంత్రివర్గానికి సమర్పించనుంది. నివేదిక సమర్పణ అనంతరం మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. నివేదికలో ఉండే సూచనలు, సిఫార్సుల మేరకు తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాళేశ్వరం పథకంపై గత ప్రభుత్వం కాలంలో అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం పనులపై సమగ్రంగా సమీక్ష చేసి కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా కేబినెట్ లోపల కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Telangana Cabinet to meet on August 4 for a special session to review the Kaleshwaram Commission report.
The Telangana state cabinet is scheduled to meet on August 4. This special meeting is being convened to review the report submitted by the Kaleshwaram Commission regarding the Kaleshwaram Lift Irrigation Project. The state government had already appointed a committee to study the findings of the commission.
The committee includes the secretaries of the Irrigation Department, Law Department, and General Administration Department (GAD) as its members.
This committee is expected to submit its report to the state cabinet on August 4. Following the submission, the cabinet will hold detailed discussions on the recommendations and suggestions made in the report. Based on these deliberations, the government may decide on the next steps.
The Kaleshwaram project had drawn criticism and allegations during the previous government’s tenure. After coming to power, the current government ordered a comprehensive review of the project’s execution and established the commission. The upcoming cabinet meeting is likely to play a key role in deciding the course of action based on the commission’s findings.