ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
A tragic train accident near Cuddalore in Tamil Nadu left two school students dead and several others injured when a fast-moving train collided with a school van at a railway crossing.

తమిళనాడులోని కడలూరు సమీపంలో ఈ ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సెమ్మన్కుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళుతున్న వ్యాన్‌ను వేగంగా వస్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. వ్యాన్‌లో ఉన్న మరికొంత మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ రైల్వే ట్రాక్‌ను దాటుతోంది. అదే సమయంలో రైలు వచ్చి ఢీకొనడంతో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద వాతావరణం ఏర్పడింది. స్థానికులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టి గాయపడిన విద్యార్థులను కడలూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రమాదం జరిగే సమయంలో ట్రాక్‌ను ఎలా దాటుతున్నది, అలర్ట్ సిగ్నల్స్ ఎలా మిస్ అయ్యాయన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
A horrific train accident occurred this morning near Cuddalore in Tamil Nadu, leaving two school children dead and several others seriously injured. The tragic incident took place at the Semmankuppam railway crossing when a speeding train collided with a school van carrying students.
The school van was reportedly crossing the railway track at the time of the incident when the train hit it with force, completely crushing the vehicle. The impact was so severe that the van was mangled beyond recognition, causing panic and heartbreak in the local community.
Locals quickly rushed to the spot and began rescue operations. The injured students were immediately shifted to the Cuddalore Government Hospital, where a few of them are reportedly in critical condition.
Authorities have initiated an inquiry into how the van attempted to cross the track at the time and whether any safety signals were missed. Officials are looking into the reasons behind this avoidable tragedy.