
సూపర్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’ ఫస్ట్ సింగిల్ “వైబ్ ఉంది” జూలై 26న విడుదల కాబోతోంది. టీజర్‌తోనే అంచనాలు పెంచిన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్లకు శ్రీకారం చుట్టుతోంది.
Superhero Teja Sajja’s pan-India film ‘Mirai’ is all set to launch its first single “Vibe Undhi” on July 26. After raising expectations with a gripping teaser, the fantasy action entertainer is now kickstarting its musical promotions.
తెలుగు-ఇంగ్లీష్ ద్విభాషా వార్తా కథనం | Bilingual News Article:
హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా, ఈసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో “మిరాయ్” అనే మైథో-ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టీజర్ విడుదలై, భారీ విజువల్స్, విభిన్న కథతో సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడు తొలి పాట “వైబ్ ఉంది” జూలై 26న రిలీజ్ కానుంది.
పోస్టర్ చూస్తే ఇది ఓ హై ఎనర్జీ టెక్నో బీట్‌గా ఉంటుందని తెలుస్తోంది. హీరో తేజ సజ్జా – రితికా నాయక్ మధ్య కెమిస్ట్రీ, లుక్ లు, స్టైలిష్ అవుట్‌ఫిట్స్ ఆకట్టుకుంటున్నాయి. తేజ అగ్రెసివ్ స్టైలింగ్‌లో కనిపించగా, రితికా గ్లామరస్‌గా కనిపిస్తుంది. బ్యాక్‌డ్రాప్‌లో గోల్డెన్ ఎనర్జీ స్పార్క్స్ సినిమాకు మైథో-ఫాంటసీ టచ్‌ను అందిస్తున్నాయి.
ఈ సినిమాలో మనోజ్ మంచు విలన్‌గా, శ్రీయ శరణ్, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతోపాటు సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లేను కూడా స్వయంగా అందిస్తున్నారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించగా, శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు.
కార్తికేయ 2, జాట్ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలు నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మిరాయ్ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తోంది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2D, 3D ఫార్మాట్లలో 8 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో రికార్డు స్థాయిలో VFX వర్క్ జరుగుతోంది.
Superhero Teja Sajja, director Karthik Ghattamneni, producers TG Vishwa Prasad, and Krithi Prasad are set to release the first single “Vibe Undhi” from their pan-India film Mirai on July 26
After creating a nationwide sensation with HanuMan, Teja Sajja returns with the grand fantasy action drama Mirai, produced by People Media Factory. The teaser has already received an overwhelming response across India, promising a visual spectacle with a rich fantasy universe and compelling storyline. The latest update reveals that the film’s first single, “Vibe Undhi,” will release on July 26. From the title and poster, it’s evident that the song is a high-energy techno beat track.
The chemistry between lead pair Teja Sajja and Ritika Nayak stands out. Teja looks rugged and heroic in a stylish outfit, while Ritika appears glamorous and intense, creating a romantic vibe on screen. The glowing golden energy sparks in the backdrop amplify the film’s mytho-fantasy tone.
Manoj Manchu plays a powerful villain in the film, with Shriya Saran, Jayaram, and Jagapathi Babu in important roles. Director Karthik Ghattamneni also handled cinematography and screenplay, while Manibabu Karanam wrote the dialogues. Art direction is by Sri Nagendra Tangala, and Sujith Kumar Kolli serves as executive producer.
Mirai is set to feature record-breaking VFX shots. The film will release worldwide on September 5 in 2D and 3D formats across 8 languages. After hits like Karthikeya 2 and Jaat, People Media Factory is aiming for yet another pan-India blockbuster with Mirai.