
Suparipalana lo Tholi Adugu: Free Bus Travel for Women from August 15 | సుపరిపాలనలో తొలి అడుగు – ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
Good governance begins with promises fulfilled—declared TDP State Vice-President Y.V.B. Rajendra Prasad, who announced that free bus travel for women will commence from August 15 as part of the ‘Super Six’ guarantees announced by N. Chandrababu Naidu. ఉయ్యూరులో నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇంటింటికీ తిరిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పింఛన్ రూ.4000, తల్లికి వందనం పథకం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటివి ఇప్పటికే అమలవుతున్నాయని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ఉయ్యూరు పట్టణాధ్యక్షుడు జంపాన గుర్నాధం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మూడో వార్డు సాయి మహల్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లారు. ప్రజల అభిప్రాయాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ—
“ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే పింఛన్‌ను రూ.4000గా పెంచాం. తల్లికి వందనం కింద విద్యార్థుల సంఖ్యను అనుసరించి సాయం అందుతోంది. మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇవ్వడమూ కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.”
ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, పూర్వ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.