Singapore Tour a Grand Success – CM Chandrababu Completes 26 Strategic Engagements..సింగపూర్ పర్యటన

సింగపూర్ పర్యటన విజయవంతం – చంద్రబాబు బృందం 26 కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నది

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన నాలుగు రోజుల సింగపూర్ పర్యటన సూపర్ సక్సెస్‌గా ముగిసింది. మంత్రులు నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ సహా అధికారులతో కలిసి ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ పర్యటనలో మొత్తం 26 కార్యక్రమాలు నిర్వహించగా, వాటిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సింగపూర్‌లోని ప్రఖ్యాత ప్రాజెక్టులను ప్రత్యక్షంగా సందర్శించి, వాటిని రాష్ట్రంలో ఎలా అనుసరిస్తే మంచిదో అధ్యయనం చేశారు.

సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్, వాణిజ్య, పరిశ్రమల మంత్రి టాన్ సీ లెంగ్, హోం వ్యవహారాల మంత్రి కె. షణ్ముగం తదితరులతో సీఎం సమావేశమయ్యారు. గత ప్రభుత్వ విధానాల వల్ల దెబ్బతిన్న ఏపీ-సింగపూర్ సంబంధాలను పునరుద్ధరించడంలో చంద్రబాబు విజయవంతం అయ్యారు.

విశాఖపట్నంలో నవంబరు 14–15 తేదీల్లో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యేందుకు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు. పర్యటన మొత్తం వ్యవధిలో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే చంద్రబాబు బృందానికి సహకారాన్ని అందించారు.
Singapore Tour a Grand Success – CM Chandrababu Completes 26 Strategic Engagements

With the goal of promoting Andhra Pradesh globally and attracting investments, Chief Minister Chandrababu Naidu concluded a successful four-day tour of Singapore. He was accompanied by ministers Nara Lokesh, P. Narayana, TG Bharat, and senior officials.

The CM participated in 26 key engagements including business meetings, site visits, and roundtable discussions. He studied prestigious Singaporean urban projects and explored possibilities of implementing similar models in Andhra Pradesh.

Chandrababu met with Singapore President Tharman Shanmugaratnam, Senior Minister Lee Hsien Loong, Trade & Industry Minister Tan See Leng, and Home Affairs Minister K. Shanmugam. He successfully restored the AP–Singapore relations which had weakened due to past governance issues.

He extended an invitation to Singapore delegates to attend the Global Investors Summit scheduled to be held in Visakhapatnam on November 14–15. Indian High Commissioner to Singapore, Shilpak Ambule, supported the Chief Minister’s team throughout the tour.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *