Siddipet District Collector K. Haimavathi instructed revenue officials to resolve all applications received under the Bhu Bharati program on a priority basis…భూభారతి దరఖాస్తులను

భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అన్ని అప్లికేషన్లను యుద్ధ ప్రాతిపదికన డిస్పోజల్ చేయాలని సూచించారు.

Siddipet District Collector K. Haimavathi instructed revenue officials to resolve all applications received under the Bhu Bharati program on a priority basis.

సిద్దిపేట
శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డీవోలు, తాసిల్దారులు, భూభారతి ప్రత్యేక అధికారులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తోందని తెలిపారు.

భూ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రం ప్రవేశపెట్టిన ఈ చట్టం అమలులో భాగంగా జిల్లాలో విజయవంతంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను చట్టం నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు సదానందం, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
Siddipet District Collector K. Haimavathi has directed revenue officials to expedite the resolution of all applications submitted under the Bhu Bharati program. She instructed that applications received through revenue conferences in villages must be processed and cleared on a priority basis.

On Saturday, a review meeting was held at the Integrated District Office Complex conference hall with RDOs, Tahsildars, and special Bhu Bharati officials. Additional District Collector Abdul Hameed was also present. Speaking on the occasion, Collector Haimavathi said that the Telangana government has implemented the Bhu Bharati Act with high priority to provide permanent solutions to long-pending land issues.

She emphasized that successful revenue conferences have already been conducted across the district, and all applications from the public related to land disputes should be thoroughly verified and resolved quickly as per the provisions of the Act. RDOs Sadanandam, Chandrakala, and other officials participated in the meeting.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *