Jam Ravi Focus on Municipality Development

మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ జామ్ రవి తెలిపారు. The municipal chairman Jam Ravi said steps will be taken to develop the municipality comprehensively and make it a model.
శామీర్పేట, మార్చి 16: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం సోమవారం చైర్మన్ జామ్ రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పార్టీలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. వచ్చే వేసవికాలంలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
He emphasized that development activities should go beyond political differences and urged officials to ensure there is no water shortage during the upcoming summer by taking preventive measures.
సమావేశంలో డ్రైనేజ్ సమస్యలు, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ఎదురయ్యే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని అధికారులకు చైర్మన్ సూచించారు.
The meeting also discussed key civic issues including drainage, street lighting, and sanitation. Officials were directed to respond promptly to public grievances and resolve them without delay.
ఈ సమావేశంలో వైస్ చైర్పర్సన్ మోర్సుబాయ్ శశిరేఖ, కమిషనర్ పవన్ కుమార్, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Vice Chairperson Morsubai Shashirekha, Commissioner Pawan Kumar, councillors, and municipal officials were present at the meeting.