కాలేజీకి వెళ్లే 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేయాలని, త్వరలో రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Revanth Reddy Announces Free AC Bus Travel for Women, Electric Scooters for College Girls

కాలేజీకి వెళ్లే 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేయాలని, త్వరలో రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే నడపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Telangana Chief Minister Revanth Reddy announced that the government is planning to distribute electric scooters to college-going girls above 18 years and provide free travel for women in upcoming electric AC buses. He also stated that Hyderabad aims to operate only electric buses by December 2026.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా 18 ఏళ్లు నిండిన కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వివిధ రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

స్వయం సహాయక సంఘాల తయారీ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్ వేదికగా విక్రయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. ఇందిరా బజార్ ద్వారా స్థానిక ప్రతిభను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.

రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తారని వారిని తక్కువగా చూడకూడదని అన్నారు. మహిళలు వ్యాపారాల్లో ముందుకు రావడానికి బస్సుల యాజమాన్యంలో కూడా భాగస్వామ్యం కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలు మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని వివరించారు.

హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని, మరో 2300 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో చేరనున్నాయని చెప్పారు.

2026 డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్‌లో డీజిల్ బస్సులు పూర్తిగా తొలగించి, అన్ని బస్సులను ఎలక్ట్రిక్ ఏసీ బస్సులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

అలాగే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *