Reddy urged the Centre to ensure immediate urea supply as per the state’s requirement, citing severe shortage affecting farmers…హైదరాబాద్

Reddy urged the Centre to ensure immediate urea supply as per the state’s requirement, citing severe shortage affecting farmers.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన యూరియాను పూర్తిగా సరఫరా చేయకపోవడం వల్ల రైతాంగం ఇబ్బందులు పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణకు 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయ్యాయని ఆయన వివరించారు.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా కు సమర్పించిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పలుమార్లు లేఖలు రాసినప్పటికీ, కేంద్రం తగినంత యూరియా ఇవ్వకపోవడం రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నదని ఆయన అన్నారు.

పార్లమెంట్ వేదికపై తెలంగాణ ఎంపీలు నిరసనలు తెలుపుతున్నా, కోటా మేరకు యూరియా విడుదల చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీఎం విమర్శించారు. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే యూరియాను సరఫరా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *