అక్సా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, పేద కుటుంబాలకు రంజాన్ కిట్లు, నూతన దుస్తుల పంపిణీ

Ramzan kits and new clothes distributed to municipal workers and poor families in Thumkunta village of Shamirpet mandal under the initiative of Aksa Welfare Association.

Ramzan kits and new clothes distributed to municipal workers and poor families in Thumkunta village of Shamirpet mandal under the initiative of Aksa Welfare Association. |

మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, శామీర్‌పేట్, మార్చి 12: అక్సా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూంకుంట గ్రామంలో మున్సిపల్ సిబ్బంది మరియు ఆర్థికంగా బలహీన వర్గాల వారికి రంజాన్ కిట్లతో పాటు నూతన దుస్తులను పంపిణీ చేశారు. మొత్తం సుమారు 150 మంది లబ్ధిదారులకు ఈ సహాయం అందించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని, ఇలాంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కొనసాగించే ప్రయత్నం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అబ్దుల్ రెహమాన్, మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, రాజకీయ నాయకులు కృష్ణారెడ్డి, ఈశ్వర్ గౌడ్, రాజు యాదవ్, మధుసూదన్ రెడ్డి, దావూదీయ మస్జిద్ కమిటీ సభ్యులు, బాబా, మహమ్మద్ ముదస్సిర్, మహబూబ్ జానీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *