Quit India Martyrs’ Memorial Day was observed grandly at Ranarang Chowk in Tenali…తెనాలిలో

తెనాలిలో క్విట్ ఇండియా అమరవీరుల స్ఫూర్తిని గుర్తు చేస్తూ రణరంగ చౌక్‌లో ఘనంగా సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. Quit India Martyrs’ Memorial Day was observed grandly at Ranarang Chowk in Tenali.

తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సోమవారం రణరంగ చౌక్‌లో క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరులకు పూలమాలలు సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1942 ఆగస్టు 12న మహాత్మా గాంధీ పిలుపు మేరకు తెనాలిలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. వారిలో మాజేటి సుబ్బారావు, సిరిగిరి లింగం, భాస్కరుని లక్ష్మీనారాయణ, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయోగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య ఉన్నారని వివరించారు.
స్వరాజ్యం కోసం రైతులు ఆస్తులను త్యాగం చేశారని, మహిళలు తమ మెడలోని నగలను గాంధీజీకి అందజేసి స్వాతంత్ర్య పోరాటంలో భాగమయ్యారని చెప్పారు.
క్విట్ ఇండియా ఘటనకు 17 సంవత్సరాల తర్వాత అమరవీరులు ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలో ఏడు స్తూపాలు, ఒక విగ్రహాన్ని నిర్మించి, ఆ ప్రదేశానికి రణరంగ చౌక్ అని పేరు పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
కార్యక్రమం అనంతరం, వివిధ రంగాల్లో ప్రజాసేవలందిస్తున్న ప్రముఖులను ఘనంగా సన్మానించారు.

Quit India Martyrs’ Memorial Day was organised at Ranarang Chowk in Tenali under the aegis of the municipal council on Monday. Civil Supplies Minister Nadendla Manohar attended as chief guest, hoisted the national flag, and paid floral tributes to the martyrs.
Speaking on the occasion, he recalled that on August 12, 1942, during the Quit India Movement inspired by Mahatma Gandhi, seven freedom fighters sacrificed their lives in Tenali — Majeti Subbarao, Sirigiri Lingam, Bhaskaruni Lakshminarayana, Tammineni Subbareddy, Gali Ramakotayya, Prayoga Raghavayya, and Jasti Appayya.
He noted that farmers sacrificed their assets for Swaraj, and women offered their jewellery to Gandhiji as part of the freedom struggle.
Seventeen years after the incident, seven memorial pillars and a statue were erected at the site where the martyrs fell, and the place was named Ranarang Chowk.
After the commemorative event, prominent personalities serving the public in various fields were felicitated.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *