CM Revanth Reddy pays tribute to PV Narasimha Rao on his birth anniversary

భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పీవీ దేశ ఆర్థిక వ్యవస్థకు రూపురేఖలు మార్చిన గొప్ప నేతగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా, సమాజానికి చిరస్మరణీయ సేవలు అందించిన నాయకుడిగా గుర్తు చేశారు.
ఈ నివాళుల కార్యక్రమంలో సీఎం సలహాదారు వెమ్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, మట్టా రాగమయి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
📌 Telugu News | Full report in Telugu
📰 English News
CM Revanth Reddy pays floral tribute to PV Narasimha Rao on his birth anniversary.
Report:
On the occasion of the birth anniversary of Bharat Ratna and former Prime Minister PV Narasimha Rao, Telangana Chief Minister Revanth Reddy paid floral tribute to his portrait at his official residence in Jubilee Hills.
CM Revanth recalled PV’s immense contribution to the country as a multilingual scholar, writer, and the architect of modern economic reforms that placed India on the path of progress.
The tribute event was attended by CM’s advisor Vem Narender Reddy, MLAs Mandula Samuel, Matta Ragamayee, and Tourism Corporation Chairman Ramesh Patel.