Pulivendula and Ontimitta ZPTC bypolls are witnessing a series of incidents—intimidation, booth capturing, false cases—raising allegations of abuse of power, conspiracies, physical attacks, and curbs on media, undermining the democratic process…పులివెందుల,

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల్లో భయపెట్టే రాజకీయాలు, బూత్ ఆక్రమణలు, తప్పుడు కేసులు—ఇలా ప్రజాస్వామ్యాన్ని అవమానపరచే ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. అధికార దుర్వినియోగం, కుట్రపూరిత చర్యలు, భౌతిక దాడులు, మీడియా నియంత్రణతో ఎన్నికల స్వేచ్ఛ దెబ్బతింటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Pulivendula and Ontimitta ZPTC bypolls are witnessing a series of incidents—intimidation, booth capturing, false cases—raising allegations of abuse of power, conspiracies, physical attacks, and curbs on media, undermining the democratic process.

పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాల ఉపఎన్నికల ప్రకటన తర్వాత, స్థానిక రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. వైయస్సార్‌సీపీ ఆరోపణల ప్రకారం, టీడీపీ అనుచరులు, కొంతమంది అధికారులు, పోలీసులు కలిసి ఎన్నికలను ప్రభావితం చేయడానికి పథకాలు రచిస్తున్నారు. వీటిలో వైయస్సార్‌సీపీ నాయకులపై దాడులు, వందల మందిని బైండోవర్ చేయడం, పోలింగ్ బూత్‌లను పక్క గ్రామాలకు మార్చడం, ఓటర్లను భయపెట్టడం, తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం ఉన్నాయి.

ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన దాడుల్లో పలువురు నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. కార్లపై రాళ్లు, కర్రలతో దాడులు, పెట్రోల్ పోసి కాల్చే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ రోజున మీడియా కవరేజీని అడ్డుకోవడానికి ప్రయత్నాలు, లైవ్ వాహనాలపై దాడుల ప్రణాళికలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.

వైయస్సార్‌సీపీ వర్గాలు ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలుగా పేర్కొంటూ, చివరికి ప్రజల తీర్పే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
After the bypoll notification, YSRCP alleges that TDP cadres, aided by some officials and police, are working to influence the elections—through attacks, mass bindovers, relocating polling booths, intimidating voters, and filing false SC/ST cases.

Incidents on August 5 and 6 left several leaders injured, with stone and stick attacks, and even attempts to set vehicles on fire. On polling day, alleged plans include blocking media coverage and attacking live broadcast vehicles.

YSRCP calls these acts an assault on democracy, expressing confidence that people’s verdict will prevail.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *