Prime Minister Narendra Modi has completed 4,078 days in office, surpassing Indira Gandhi’s record to become the second-longest-serving Prime Minister in India’s history…ప్రధానిగా నరేంద్రమోడీ

ప్రధానిగా నరేంద్రమోడీ 4,078 రోజులు కొనసాగి, ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి దేశ చరిత్రలో రెండవ అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నాయకుడిగా నిలిచారు.

Prime Minister Narendra Modi has completed 4,078 days in office, surpassing Indira Gandhi’s record to become the second-longest-serving Prime Minister in India’s history.

న్యూఢిల్లీ జూలై 25: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అరుదైన ఘనత సాధించారు. 2025 జూలై 25 నాటికి ఆయన దేశానికి 4,078 రోజులు ప్రధానిగా సేవలందించారు. ఈ క్రమంలో, వరుసగా మూడు సార్లు ప్రధాని పదవి చేపట్టిన మోడీ, ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు. ఇందిరాగాంధీ 1966 నుంచి 1977 మధ్య 4,077 రోజులు దేశ ప్రధానిగా పనిచేశారు.

భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు 16 సంవత్సరాలు 286 రోజులపాటు ప్రధానిగా ఉన్నారు. ఈ రికార్డును సమీప భవిష్యత్తులో ఎవరూ అధిగమించే అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. ప్రధానిగా అవతరించేముందు మోడీ 2001 నుంచి 2014 వరకు 14 సంవత్సరాలపాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు.

Prime Minister Narendra Modi has achieved a rare milestone by becoming the second-longest-serving Prime Minister of India, completing 4,078 days in office as of July 25, 2025. Modi, who assumed office for the third consecutive term, surpassed the record of Indira Gandhi, who served for 4,077 days between 1966 and 1977.

Jawaharlal Nehru remains India’s longest-serving Prime Minister, holding office for 16 years and 286 days from August 15, 1947, to May 27, 1964. Political analysts believe that Nehru’s record is unlikely to be broken anytime soon. Before becoming Prime Minister, Modi served as the Chief Minister of Gujarat for 14 years from 2001 to 2014.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *