మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!

PM Modi Visits Former Gujarat CM Rupani’s Residence to Offer Condolences for English News and Telugu News kindly Scroll Down.

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!

అహ్మదాబాద్:
గుజరాత్‌లో జరిగిన భయంకర విమాన ప్రమాదంలో మరణించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఈ రోజు అహ్మదాబాద్‌లోని రూపానీ నివాసానికి వెళ్లిన మోదీ… వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
విజయ్ రూపానీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ, వారి సేవలను స్మరించుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ –
“దేశ సేవలో విజయ్‌ రూపానీ ఎనలేని పాత్ర పోషించారు. వారి మరణం నన్ను దిగ్ర్భాంతికి గురి చేసింది. కుటుంబానికి తగిన సాయం అందిస్తాం,” అని చెప్పారు.

ఇంతకు ముందు, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన మోదీ… ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

PM Modi Visits Former Gujarat CM Rupani’s Residence

Ahmedabad:
In the aftermath of the tragic Ahmedabad plane crash that claimed the life of former Gujarat Chief Minister Vijay Rupani, Prime Minister Narendra Modi visited Rupani’s residence today to offer condolences to the bereaved family.

Modi personally met the family members, consoled them, and paid rich tributes to Rupani’s political and social contributions.

Speaking to the media, the PM said:
“Vijay Rupani’s contributions to Gujarat and India are immense. His sudden demise is deeply saddening. The government stands with his family and will provide all support.”

Prior to this, PM Modi visited the crash site and interacted with injured families at the hospital.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *